AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం

బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం

Phani CH
|

Updated on: Mar 07, 2026 | 5:28 PM

Share

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదారం గ్రామంలో ఓ సాధారణ బండరాయిగా భావించిన చోట, భారీ పురాతన శ్రీమహా విష్ణు విగ్రహం బయటపడింది. మూడు సంవత్సరాలు ఇసుకలో పాతిపెట్టి ఉన్న ఈ అపురూప శిల్పం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. నల్లరాతితో మలిచిన ఈ విగ్రహం చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు వస్తున్నారు. గ్రామస్తులు ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కాలగర్భంలో కలిసిపోయిన మన అపురూప శిల్ప సంపద అప్పుడప్పుడు అనుకోకుండా బయటపడుతూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. తాజాగా అలాంటి ఘటనే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గత మూడేళ్లుగా ఒక సాధారణ ‘బండరాయి’ అని ఊరంతా భావించి వదిలేసిన చోట, తవ్వితే ఏకంగా అతి పురాతనమైన శ్రీమహా విష్ణువు రాతి విగ్రహం బయటపడింది. జిల్లాలోని మహాముత్తారం మండలం మాదారం శివారులోని పెద్దవాగులో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు మూడు సంవత్సరాల క్రితమే ఈ విగ్రహంలోని కొంత భాగం ఇసుకలో బయటపడింది. స్థానికులు అది పనికిరాని రాతి గుట్ట అని భావించి పట్టించుకోలేదు. కానీ, ఇటీవల ఒక వ్యక్తి దీనిని గుర్తించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో వైరల్ కావడంతో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి గ్రామానికి చేరుకుని, గ్రామస్తుల సహాయంతో జేసీబీ ద్వారా ఇసుకను తొలగించగా భారీ విష్ణుమూర్తి విగ్రహం ప్రత్యక్షమైంది. బయటపడ్డ ఈ విగ్రహం చాలా పురాతనమైనదని, నల్లరాతితో మలిచారని గుర్తించారు. విగ్రహం ముక్కు, చేతి వేళ్ల భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, విగ్రహం ఆకృతి మాత్రం అద్భుతంగా ఉంది. ఈ అపురూప విగ్రహాన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. తమ గ్రామంలోనే విష్ణుమూర్తి వెలిశాడని సంతోషిస్తున్న గ్రామస్తులు, త్వరలోనే ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన

మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..

APSRTC: పదో తరగతి విద్యార్థులకు APSRTC బంపర్ ఆఫర్‌

AP Weather: ఏపీకి ఎండల పై హెచ్చరిక .. ఈసారి వేసవి మరింత తీవ్రం!

Srisailam: మల్లన్న సన్నిధికి ‘సాష్టాంగ’ యాత్ర..

Follow Us