కావ్యపాప ఛీ కొట్టింది.. ఐపీఎల్ 2026 వేలంలోనూ అమ్ముడవ్వలే.. కట్‌చేస్తే.. నాటౌట్ ఇన్నింగ్స్‌లతో ఊచకోత..
Abhinav Manohar, Vijay Hazare Trophy: క్రికెట్‌లో ఒక్కోసారి అదృష్టం వెక్కిరించినా, ప్రతిభ మాత్రం ఎప్పుడూ వెనకబడదు. కర్ణాటక బ్యాటర్ అభినవ్ మనోహర్ విషయంలో ఇదే నిజమవుతోంది. ఐపీఎల్ 2026 వేలంలో ఏ జట్టూ తనను కొనుగోలు చేయకపోవడం, అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తనను వదిలేయడం వంటి పరిణామాల తర్వాత, మనోహర్ మైదానంలో పగ తీర్చుకుంటున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో అతను ఆడుతున్న తీరు చూస్తుంటే ఫ్రాంచైజీలు భారీ తప్పు చేశాయేమో అనిపిస్తోంది.

Abhinav Manohar, Vijay Hazare Trophy: ఐపీఎల్ 2026 వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన బాధో లేక తనను వదిలేసిన జట్టుపై కసి చూపించాలని అనుకున్నాడేమో కానీ, అభినవ్ మనోహర్ ప్రస్తుతం బౌలర్లకు పీడకలగా మారాడు. వేలం ముగిసిన తర్వాత అతను ఆడిన ఏ ఒక్క మ్యాచ్‌లో కూడా బౌలర్లు అతన్ని అవుట్ చేయలేకపోతున్నారు.
కావ్యా మారన్ టీమ్ నుంచి బయటకు..
ఆ మిడిల్ ఆర్డర్ బ్యాటర్, ఫినిషర్ అయిన అభినవ్ మనోహర్‌ను ఐపీఎల్ 2025 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ రూ. 3.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఐపీఎల్ 2026 మెగా వేలానికి ముందు ఎస్ఆర్‌హెచ్ (SRH) అతన్ని విడుదల చేసింది. దురదృష్టవశాత్తూ డిసెంబర్ 16న జరిగిన వేలంలో ఏ జట్టు కూడా అతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు.
ఐదు మ్యాచ్‌లు.. ఒక్కసారి కూడా అవుట్ కాలేదు!
వేలంలో నిరాశ ఎదురైన తర్వాత, డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక తరపున అభినవ్ బరిలోకి దిగాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా అతను ప్రత్యర్థి బౌలర్లకు దొరకలేదు.
అభినవ్ మనోహర్ స్కోర్ల వివరాలు:
జార్ఖండ్‌పై: 56 పరుగులు (నాటౌట్)
కేరళపై: బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
తమిళనాడుపై: 20 పరుగులు (నాటౌట్)
పుదుచ్చేరిపై: 21 పరుగులు (నాటౌట్)
త్రిపురపై (జనవరి 3): 79 పరుగులు (నాటౌట్)
అద్భుతమైన గణాంకాలు..
ఈ టోర్నమెంట్‌లో అభినవ్ మనోహర్ కేవలం 90 బంతులను ఎదుర్కొని 176 పరుగులు చేశాడు. ఇందులో 9 సిక్సర్లు, 17 ఫోర్లు ఉన్నాయి. అతని సగటు లెక్కించలేనంతగా ఉంది. ఎందుకంటే అతను ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లోనూ నాటౌట్‌గా నిలిచాడు.
తనను వద్దనుకున్న వారికి తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నాడు అభినవ్ మనోహర్. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోయినా, దేశవాళీ క్రికెట్‌లో అతను చూపిస్తున్న ఈ ఫామ్ భవిష్యత్తులో ఐపీఎల్ జట్లు తన వైపు తిరిగి చూసేలా చేస్తోంది. కావ్యా మారన్, ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం అతన్ని వదిలేసి పొరపాటు చేశారా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




