డీమాన్ పవన్ తండ్రి కన్నుమూత!
బిగ్ బాస్ సీజన్ 9 ఫేమ్ డిమాన్ పవన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి దుర్గా ప్రసాద్ మార్చి 10న నోటి క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. ఈ విషాద వార్తను డిమాన్ పవన్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తండ్రి చికిత్స కోసమే పవన్ బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టారు.
బిగ్ బాస్ సీజన్ 9 ఫేమ్ డిమాన్ పవన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి దుర్గా ప్రసాద్ మార్చి 10న కన్నుమూశారు. గత కొంతకాలంగా నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్న దుర్గా ప్రసాద్ చికిత్స తీసుకుంటూనే లిక్విడ్ డైట్ మాత్రమే తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూలలో స్వయంగా వెల్లడించారు. నోటి నుంచి సరిగా మాటలు రాని పరిస్థితుల్లోనూ, బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న తన కుమారుడు డిమాన్ పవన్‌కు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తన కొడుకు గురించి మాట్లాడుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు. తన తండ్రికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతోనే డిమాన్ పవన్ బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టారు. కర్టెన్ రైస్ ఎపిసోడ్‌లో కింగ్ నాగ్‌తో స్వయంగా ఈ విషయాన్ని పవన్ పంచుకున్నారు. చివరికి టాప్ 3లో ఉన్న సమయంలో, తన తండ్రి వైద్య ఖర్చుల గురించే ఆలోచించి 15 లక్షల సూట్‌కేస్‌ను తీసుకొని షో నుండి బయటికి వచ్చినట్లు ఫినాలే ఎపిసోడ్‌లో వివరించారు.
మరిన్ని వీడియోల కోసం :
స్పిరిట్ కథలో అవే హైలైట్స్ !
గ్లోబల్ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్
ఉస్తాద్ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

