21 ఫోర్లు, 10 సిక్సర్లు.. ప్రపంచ కప్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. దిమ్మతిరిగే రికార్డ్ ఎవరిదంటే?
Fastest double century in ODI World Cup: వన్డే ప్రపంచ కప్ చరిత్రలో కేవలం మూడు డబుల్ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ వన్డే ప్రపంచ కప్‌లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డును కలిగి ఉన్నాడు. ఈ ఆటగాడు 2023 ప్రపంచ కప్‌లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ రికార్డును బద్దలు కొట్టడం చాలా కష్టం.

Fastest double century in ODI World Cup: క్రికెట్ చరిత్రలో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఉన్నాయి, కానీ గ్లెన్ మాక్స్‌వెల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ వాటన్నింటికీ భిన్నం. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై మాక్స్‌వెల్ చేసిన 201 పరుగుల విధ్వంసం క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. తీవ్రమైన కండరాల నొప్పితో బాధపడుతూ కూడా, నిలబడలేని స్థితిలో ఒంటికాలితో పోరాడి అసాధ్యమైన విజయాన్ని ఆస్ట్రేలియాకు అందించాడు.
ఓటమి అంచున ఆస్ట్రేలియా..
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఒక దశలో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం అంచున నిలిచింది. ప్రపంచకప్‌లో అతిపెద్ద అపశృతి తప్పదని అందరూ భావిస్తున్న తరుణంలో గ్లెన్ మాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చాడు.
రికార్డుల విధ్వంసం: మాక్స్‌వెల్ కేవలం మ్యాచ్‌ను గెలిపించడమే కాదు, రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు.
వేగవంతమైన ద్విశతకం: కేవలం 128 బంతుల్లోనే 201 పరుగులు చేసి వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
నాటౌట్ ఇన్నింగ్స్: వన్డే క్రికెట్‌లో లక్ష్యాన్ని ఛేదించే సమయంలో డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాటర్ ఆయనే.
సిక్సర్ల వర్షం: తన ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో ఆఫ్ఘన్ బౌలర్లను హడలెత్తించారు.
నొప్పితో పోరాటం – ‘ది గ్రేటెస్ట్ ఇన్నింగ్స్’..
ఈ ఇన్నింగ్స్‌లో అత్యంత ముఖ్యమైన విషయం మాక్స్‌వెల్ పట్టుదల. ఇన్నింగ్స్ మధ్యలో ఆయనకు తీవ్రమైన ‘క్రాంప్స్’ (కండరాలు పట్టేయడం) వచ్చాయి. కనీసం నడవలేని స్థితిలో, రన్నింగ్ తీయలేని పరిస్థితుల్లో కూడా రిటైర్డ్ హర్ట్ కాకుండా మైదానంలోనే ఉండిపోయాడు. కేవలం తన చేతుల శక్తితో, కేవలం నిలబడిన చోటు నుండే బంతిని సిక్సర్లుగా మలిచిన తీరు అద్భుతం. దీనిని క్రీడా విశ్లేషకులు “వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్” అని అభివర్ణించారు.
చారిత్రాత్మక విజయం..
ప్యాట్ కమిన్స్‌తో కలిసి 8వ వికెట్‌కు రికార్డు స్థాయిలో 202 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మాక్స్‌వెల్, ఆస్ట్రేలియాను సెమీఫైనల్స్ చేర్చాడు. ఒక అసాధ్యమైన మ్యాచ్‌ను సుసాధ్యం చేసి, ప్రపంచ క్రికెట్‌కు తన సత్తా ఏంటో చాటి చెప్పారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




