Brain: చనిపోయే 30 సెకన్ల ముందు మెదడులో ఏం జరుగుతుందంటే.? షాకింగ్ నిజం
చనిపోయే కొన్ని క్షణాల ముందు మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయ్. అలాగే మన మెదడులో ఏం జరుగుతుంది.! అనే విషయాలు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అయితే తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. ఆ వివరాలు ఇలా..

మరణానికి 30 సెకన్ల ముందు మెదడులో ఏం జరుగుతుందనే దానిపై తాజా అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. గతంలో ఏజింగ్ న్యూరోసైన్స్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన ఓ పరిశోధన ప్రకారం, చనిపోవడానికి ముందు మనిషి.. తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను గుర్తు చేసుకుంటాడు. ఈ అధ్యయనం మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న 87 ఏళ్ల వ్యక్తి మెదడు తరంగాలపై జరిగింది. ఆయనకు గుండెపోటు వచ్చినప్పుడు, మరణానికి 30 సెకన్ల ముందు శాస్త్రవేత్తలు ఆయన మెదడులోని నాడీ చర్యలను పరిశీలించారు. కలలు కనేటప్పుడు లేదా విషయాలను గుర్తు చేసుకునేటప్పుడు మెదడులో జనించే తరంగాల లాంటివి, సరిగ్గా అలాంటి తరంగాలే ఈ వ్యక్తి మెదడులో కనిపించాయి.
లూయిస్ విల్ యూనివర్సిటీ న్యూరో సర్జన్ డాక్టర్ అజ్మల్ జెమ్మర్ మాట్లాడుతూ, ఈ తరంగాలు జీవితంలోని మధుర క్షణాలను గుర్తు చేసుకోవడానికి సంకేతం కావచ్చని తెలిపారు. అయితే, ఒక్కో వ్యక్తికి గుర్తుకు వచ్చే ఘటనలు వేర్వేరుగా ఉండవచ్చని ఆయన అన్నారు. మెదడుకు రక్త సరఫరా ఆగిపోవడానికి 30 సెకన్ల ముందు వరకు ఈ తరంగాలు క్రియాశీలంగా ఉన్నాయని, ఆ తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని డాక్టర్ జెమ్మర్ వివరించారు. 2013లో ఎలుకలపై చేసిన అధ్యయనంలో కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయని ఆయన గుర్తు చేశారు. మరణానికి ముందు మెదడులో జరిగే పరిణామాలపై ఎప్పటినుంచో పరిశోధనలు జరుగుతున్నాయని, ఈ పరిశోధన మరణం గురించి మరింత లోతైన అధ్యయనాలకు స్ఫూర్తినిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఇది చదవండి: పులి వారానికి ఎన్ని కేజీల మాంసం తింటుందో తెల్సా.! వామ్మో చూస్తే నోరెళ్లబెడతారు
