AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Sirish: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్.. సందడి చేసిన బాలకృష్ణ, నాగార్జున.. ఎవరెవరు వచ్చారంటే..

అల్లు శిరీష్ - నయనికల వివాహం మార్చి 6న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో గ్రాండ్ ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు అక్కినేని నాగార్జున తన ఫ్యామిలీతో కలిసి హాజరయ్యారు. అలాగే నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్, రవితేజ వంటి అగ్ర హీరోలతో పాటు టాలీవుడ్ ప్రముఖులంతా తరలివచ్చారు.

Allu Sirish: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్.. సందడి చేసిన బాలకృష్ణ, నాగార్జున.. ఎవరెవరు వచ్చారంటే..
Allu Sirish Pre Wedding Rec
Rajitha Chanti
|

Updated on: Mar 03, 2026 | 10:08 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి భజాలు మోగుతున్నాయి. ఇప్పటికే లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 26న ఘనంగా జరిగింది. అలాగే మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ జరగనుంది. మరోవైపు టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ సైతం వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. అల్లు శిరీష్, నయనికల పెళ్లి వేడుక మార్చి 6న జరగనుంది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకను ఏర్పాటు చేశారు. అల్లు స్టూడియోలో ఘనంగా జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ సినీప్రముఖులంతా హాజరయ్యారు. హీరోహీరోయిన్లు, దర్శక నిర్మాతలు, టెక్నిషియన్స్.. దాదాపు అందరూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..

అల్లు శిరీష్, నయనికల ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో అక్కినేని ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ సందడి చేశారు. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అమల హాజరయ్యారు. వీరిని అల్లు అరవింద్ ఆప్యాయంగా ఆహ్వానించారు. అలాగే రామ్ చరణ్, సురేఖ కొణిదెల, సుష్మిత, నాగబాబు, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ హాజరయ్యారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, డైరెక్టర్ అట్లీ, మలయాళీ నటుడు బాసిల్ జోసేఫ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. సీనియర్ నటీనటులు, దర్శకులు రాఘవేంద్రరావు, బి.గోపాల్, కోదండ రామిరెడ్డి, సి.అశ్వనీదత్, దగ్గుబాటి సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, డీవీవీ దానయ్య కనిపించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..

అలాగే న్యాచురల్ స్టార్ నాని, తన భార్య అంజుతో కలిసి కనిపించారు. ప్రస్తుతం అల్లు శిరీష్, నయనికల ప్రీ రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అల్లు శిరీష్, నయనికల పెళ్లి వేడుక మార్చి 6న జరగనుంది. ఇటీవల జరిగిన వరుడి వేడుకలో కొత్త జంట రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ హాజరయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

Follow Us