పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్న కమల్, రజనీ.. ఎన్నికల కోసమేనా?
కోలీవుడ్ టాప్ స్టార్స్ రజినీకాంత్, కమల్ హాసన్ నాలుగు దశాబ్దాల తర్వాత మళ్ళీ కలిసి నటిస్తున్నారు. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్‌ను వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తమిళనాడు ఎన్నికల హీట్ ప్రారంభమయ్యేలోపే షూటింగ్ పూర్తి చేయడమే దీని వెనుక ప్రధాన కారణం అని చర్చ నడుస్తోంది.
కోలీవుడ్ అగ్ర తారలు రజినీకాంత్, కమల్ హాసన్ నాలుగు దశాబ్దాల తర్వాత ఒక సినిమా కోసం మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్‌కు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడింది. షూటింగ్, విడుదల విషయంలో మేకర్స్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఎంతో మంది దర్శకుల పేర్లు పరిశీలించిన తర్వాత, ఈ గోల్డెన్ ఛాన్స్ నెల్సన్ దిలీప్‌కుమార్‌కు దక్కింది. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా ‘జైలర్ 2’ను రూపొందిస్తున్న నెల్సన్, ఆ సినిమా పూర్తయిన వెంటనే, ఈ అక్టోబర్‌లో మల్టీస్టారర్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. భారీ స్టార్ కాస్ట్, పెద్ద బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రికార్డ్ సమయంలో పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, వచ్చే ఏడాది దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!

