AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: SRHతో తొలి మ్యాచ్.. రంగంలోకి రన్ మెషీన్.. వీడియోతో ఇచ్చిపడేశారుగా..

RCB vs SRH Opening Match: టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసిన వెంటనే ఇప్పుడు అభిమానుల దృష్టి ఐపీఎల్ 2026పై పడింది. మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్‌కు ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అతను షేర్ చేసిన నెట్ ప్రాక్టీస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

IPL 2026: SRHతో తొలి మ్యాచ్.. రంగంలోకి రన్ మెషీన్.. వీడియోతో ఇచ్చిపడేశారుగా..
Virat Kohli Rcb Vs Srh
Venkata Chari
|

Updated on: Mar 12, 2026 | 12:26 PM

Share

టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసిన తర్వాత ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఐపీఎల్ 2026పై కేంద్రీకృతమైంది. మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టీ20 లీగ్ కోసం జట్లు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ ప్రారంభించాడు. అతను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

నెట్ ప్రాక్టీస్ వీడియో వైరల్..

విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రాక్టీస్ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో అతను నెట్ సెషన్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. బ్యాటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి కోహ్లీ అద్భుత షాట్లు ఆడుతూ కనిపించాడు. ఈ వీడియోను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో భారీగా స్పందిస్తున్నారు. వేలాది కామెంట్లు, లైకులు రావడంతో ఈ వీడియో వైరల్ అయింది.

ఇవి కూడా చదవండి

మొదటి మ్యాచ్‌పై ఆసక్తి..

ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్ ఏ రెండు జట్ల మధ్య జరుగుతుందనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. తాజాగా విడుదలైన 20 మ్యాచ్ ల షెడ్యూల్ తో తొలి మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ దే అని తేలిపోయింది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానులకు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, హైదరాబాద్ మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది.

ఐపీఎల్‌లో కోహ్లీ అద్భుత రికార్డులు..

విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు 267 మ్యాచ్‌లు, 259 ఇన్నింగ్స్‌లలో అతను 39.54 సగటుతో 8,661 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 132.85 కాగా, ఐపీఎల్ కెరీర్‌లో ఎనిమిది సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ ప్రారంభం నుంచి అత్యంత స్థిరంగా ప్రదర్శన ఇస్తున్న ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు.

గత సీజన్‌లో కోహ్లీ సూపర్ ఫామ్..

ఐపీఎల్ 2025 సీజన్ కోహ్లీకి, ఆర్సీబీకి ప్రత్యేకంగా నిలిచింది. గత సీజన్‌లో అతను 15 మ్యాచ్‌లలో 54.75 సగటుతో 657 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 144.71 కాగా, ఎనిమిది అర్ధశతకాలు నమోదు చేశాడు. కోహ్లీ అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఐపీఎల్ 2026లో కూడా కోహ్లీ అదే ఫామ్ కొనసాగిస్తాడా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us