కాలిఫోర్నియాలో రెడ్ వుడ్ చెట్లను నరకడాన్ని నిరసిస్తూ జూలియా బటర్ఫ్లై అనే పర్యావరణవేత్త 738 రోజుల పాటు ఓ వెయ్యి సంవత్సరాల రెడ్ వుడ్ చెట్టుపైనే నివసించారు. 200 అడుగుల ఎత్తులో టెంట్ వేసుకుని, ఆహారం తాడు సాయంతో తెప్పించుకుంటూ, కఠినమైన వాతావరణాన్ని తట్టుకుంటూ ఆమె తన పోరాటాన్ని కొనసాగించారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు చెట్టు దిగనని నిశ్చయించుకున్నారు.