బీహార్లోని బక్సర్ జిల్లాలో ఎనిమిది నెలలుగా జీతం అందక ఒక మహిళా ప్రభుత్వ అధికారి అల్పితా సింగ్ తన కార్యాలయం ఎదుట భిక్షాటనకు దిగారు. రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఆమె విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ, నెలల తరబడి వేతనం రాకపోవడంతో నిరసనగా ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా యంత్రాంగం స్పందించింది.