Jailer 02: OTTలో జైలర్ 2.. అయినా నిరాశలో రజినీ ఫ్యాన్స్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. అయితే థియేటర్ వెర్షన్ కంటే 30 నిమిషాల అదనపు ఫుటేజ్‌తో అన్‌కట్ వెర్షన్ విడుదలవుతుందని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. ఎలాంటి కొత్త సన్నివేశాలు లేకుండా థియేటర్లలో వచ్చిన వెర్షన్‌నే ఓటీటీలో అందుబాటులోకి తీసుకురావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్- దర్శకుడు నెల్సన్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘జైలర్ 2’. గతంలో వచ్చిన ‘జైలర్’ సినిమాకు ఇది సీక్వెల్. దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలో విడుదలైన ‘జైలర్ 2’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కనీవిని ఎరుగని కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది. రజనీకాంత్ కెరీర్ లోనే కాదు కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా జైలర్ 2 రికార్డుల కెక్కింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సుమారు రూ. 830 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రజనీకాంత్ స్టైల్, స్వాగ్, యాక్షన్ సీక్వె్స్, నెల్సన్ డైరెక్షన్ అన్నిటికీ మించి అనిరుధ్ బీజీఎమ్ జైలర్ 2 సినిమాను ఇండస్ట్రీ హిట్ గా నిలిపాయి. తమిళనాడులో ఇప్పటికీ చాలా చోట్ల జైలర్ 2 సినిమా థియేటర్లలో ఆడుతోంది. నవంబర్ 11 ఈ సినిమాకు బుక్ మై షోలో 7 వేలకు పైగా టికెట్లు బుక్ అవ్వడం విశేషం. అయినా కానీ.. ఇప్పుడు జైలర్ 2 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఎస్ ! ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. నవంబర్ 12 నుంచే రజనీ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తామని ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే గురువారం అర్ధరాత్రి నుంచే జైలర్ 2 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులో వచ్చేసింది. OTTలోకి జైలర్ 2 వచ్చేసినా కూడా.. రజినీ ఫ్యాన్స్ తమ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. జైలర్ 2 మూవీ అన్ కట్ వర్షన్ ను ఓటీటీలో రిలీజ్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. థియేటర్ వర్షన్ కంటే కూడా 30 నిమిషాల ఎక్స్ ట్రా ఫుటేజీని యాడ్ చేసి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారనే టాక్ వినిపించింది. కానీ చివరకు సేమ్ థియేటర్ వర్షన్ తో జైలర్ 2 చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.దీంతో కొందరు రజినీ ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
సెహ్వాగ్ కొడుక్కి.. కోహ్లీ సలహా ఇదే.. వైరల్ అవుతున్న ఆర్యవీర్ పాత ఇంటర్వ్యూ
అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్.. 54 ప్రత్యేక రైళ్లు!
ఉసిరి ఆరోగ్యానికి మంచిదే అయినా.. వీరికి మాత్రం విషంతో సమానం!
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
ప్రశ్నించిన పాపానికి ప్రాణాల మీదకు వచ్చింది..!

