AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బాల్‌కు ఫోర్.. లాస్ట్ ఓవర్ వీడియో చూడండి..

Video: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బాల్‌కు ఫోర్.. లాస్ట్ ఓవర్ వీడియో చూడండి..

Krishna S
|

Updated on: Nov 14, 2026 | 9:30 PM

Share

క్రికెట్ అభిమానులకు అసలైన మజా అంటే ఇదే.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన అండర్-19 వన్డే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సినిమా క్లైమాక్స్‌ను తలపించింది. 338 పరుగుల కొండంత లక్ష్యం.. చేతిలో మిగిలింది ఒకే ఒక్క వికెట్.. ఆఖరి బంతికి 3 పరుగులు కావాలి..అందరి గుండె వేగం పెరిగిపోయిన ఆ క్షణంలో భారత యువ బ్యాటర్ మోహిత్ బ్యాట్ ఝుళిపించాడు. బంతిని బౌండరీకి తరలించి పాక్ ఆశలపై నీళ్లు చల్లాడు.

క్రికెట్ అభిమానులకు అసలైన మజాను పంచుతూ, నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన అండర్-19 వన్డే ఆసియా కప్ ఫైనల్‌లో భారత కుర్రాళ్లు అద్భుతం చేశారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన తుది పోరులో టీమిండియా ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. ఓటమి అంచుల దాకా వెళ్లి, ఆఖరి బంతికి ఫోర్ బాదడం ద్వారా భారత్ సాధించిన ఈ చారిత్రాత్మక గెలుపు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ భారీ స్కోరు సాధించి, భారత్ ముందు 338 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో ఇంత పెద్ద టార్గెట్‌ను ఛేదించడం అంటే సాధారణ విషయం కాదు. మ్యాచ్ చివరి ఓవర్ వరకు హోరాహోరీగా సాగింది. సరిగ్గా 50వ ఓవర్ చివరి బంతికి భారత్ విజయానికి 3 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో ఉన్నది ఒకే ఒక్క వికెట్.. స్టేడియంలో అంతా నిశ్శబ్దం..

హీరోగా నిలిచిన మోహిత్

ఆ ఒత్తిడి సమయంలో క్రీజులో ఉన్న భారత బ్యాటర్ మోహిత్ అద్భుతమైన తెగువ చూపించాడు. కేవలం 26 బంతుల్లోనే 49 పరుగులతో (నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడిన మోహిత్, ఆఖరి బంతిని బౌండరీకి తరలించాడు. బంతి బౌండరీ లైన్ దాటగానే భారత శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. అప్పటివరకు గెలుపు తమదేనని భావించిన పాకిస్థాన్ ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురై నిరాశలో మునిగిపోయారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us