మన పూజ గదుల్లో, పుస్తకాల్లో కనిపించే వెంకటేశ్వర స్వామి రూపం ఫొటో కాదు, అది ఆర్టిస్ట్ శ్రీనివాసన్ గీసిన చిత్రం. 1970లో టీటీడీ ఆహ్వానం మేరకు ఆయన గర్భగుడిలోని స్వామివారిని తదేకంగా పరిశీలించి ఆభరణాలతో, ఆభరణాలు లేకుండా రెండు చిత్రాలను గీశారు. గత 56 ఏళ్లుగా ఈ చిత్రాలే కోట్లాది భక్తుల ఆరాధ్యదైవంగా మారాయి.