AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోట్లో వేస్తే కరిగిపోయే అసలైన మాడుగుల హల్వా.. పక్కా కొలతలతో

 ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా మాడుగుల పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అక్కడి ప్రసిద్ధ హల్వా. ఒక్కసారి దీని రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ తినాలని కోరుకుంటారు. ఇది అప్పటికప్పుడు తయారు చేసే వంటకం కాదు, ఎంతో ఓపికతో, సంప్రదాయ పద్ధతిలో చేస్తేనే అసలైన రుచి, మెత్తదనం వస్తాయి. బయట స్వీట్ షాపుల్లో దొరికే మాడుగుల హల్వాను ఇంట్లోనే స్వచ్ఛంగా తయారు చేసుకోవచ్చు.

Phani CH
|

Updated on: Nov 14, 2026 | 9:38 PM

Share
కావలసిన పదార్థాలు: గోధుమలు 250 గ్రాములు, బెల్లం 450 గ్రాములు, పంచదార 50 గ్రాములు, నెయ్యి 450 గ్రాములు (డ్రై ఫ్రూట్స్ వేయించడానికి పావు కప్పు అదనంగా), జీడిపప్పు పలుకులు అర కప్పు, బాదం పలుకులు అర కప్పు, యాలకుల పొడి 1 టీస్పూన్, నీళ్లు సరిపడా.

1 / 5
ముందుగా పావు కిలో గోధుమలను శుభ్రంగా కడిగి, నీళ్లు పోసి మూడు రోజుల పాటు నానబెట్టాలి. అయితే నీళ్లు పాడవకుండా ఉండటానికి రోజూ ఉదయం, సాయంత్రం పాత నీటిని ఒంపేసి కొత్త నీళ్లు పోస్తుండాలి. గోధుమలు మెత్తగా నానిన తర్వాత వాటిని మిక్సీ జార్‌లో వేసి, కొద్దిగా నీళ్లు జోడించి మెత్తని పేస్ట్‌లా రుబ్బాలి.  ఈ మిశ్రమాన్ని పలుచని వస్త్రం లేదా జల్లెడతో వడకట్టి పాలు తీయాలి. పిప్పిలో మరోసారి నీళ్లు పోసి రుబ్బి మిగిలిన పాలను కూడా పిండుకోవాలి. ఈ గోధుమ పాలలో రెండు కప్పుల నీళ్లు కలిపి రాత్రంతా కదపకుండా పక్కన ఉంచితే పాలు కొద్దిగా పులుస్తాయి. మరుసటి రోజు పైకి తేలిన తేట నీటిని ఒంపేసి, మళ్లీ నీళ్లు పోసి కొద్దిసేపు ఆగి పై నీటిని తీసేస్తే అడుగున చిక్కటి గోధుమ పాలు సిద్ధమవుతాయి. ఈ పాలకు ఒకటిన్నర రెట్ల నీళ్లు కలిపి పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టి, కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పలుకులను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో బెల్లం, పంచదార, కొద్దిగా నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం పాకం లేత ఉండ పాకం వచ్చేవరకు మరిగించాలి. పాకం సిద్ధమయ్యాక మంటను పూర్తిగా తగ్గించి, అడుగు నుంచి కలిపిన గోధుమ పాలను ఒక చేత్తో పోస్తూ, మరో చేత్తో ఉండలు కట్టకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి.

3 / 5
మిశ్రమం చిక్కబడటం మొదలయ్యాక యాలకుల పొడి వేసి, ఒక్కో గరిటె చొప్పున నెయ్యి పోస్తూ అడుగు పట్టకుండా కలుపుతూ ఉడికించాలి. నెయ్యిని పీల్చుకుంటూ పాకం క్యారమలైజ్ అయి హల్వా మంచి గోధుమ రంగులోకి మారుతుంది. హల్వా కడాయి అంచులకు అంటుకోకుండా, వేసిన నెయ్యిలో సగానికి పైగా బయటకు తేలేంత వరకు ఓపికగా కలుపుతూ ఉండాలి.

4 / 5
చివరగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి, నెయ్యి రాసిన ప్లేట్ లేదా ట్రేలోకి హల్వాను మాత్రమే తీసుకోవాలి. పైన మరికొన్ని డ్రై ఫ్రూట్స్ చల్లి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసుకుంటే ఎంతో రుచికరమైన మాడుగుల హల్వా సిద్ధం. ఇది పదిహేను రోజుల వరకు తాజాగా నిల్వ ఉంటుంది.

5 / 5
Follow Us