AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఫిబ్రవరి దర్శన టికెట్లు, గదుల బుకింగ్ తేదీలు వచ్చేశాయ్!

Tirumala Darshan Tickets: ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, శ్రీవాణి దర్శనం, అంగప్రదక్షిణ టోకెన్లు, గదుల కోటా విడుదల తేదీలు, సమయాల పూర్తి వివరాలు తెలుసుకోండి.

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఫిబ్రవరి దర్శన టికెట్లు, గదుల బుకింగ్ తేదీలు వచ్చేశాయ్!
Tirumala Darshan Tickets
Rajashekher G
|

Updated on: Nov 14, 2026 | 11:16 PM

Share

Tirumala Darshan Tickets: ఫిబ్రవరి నెల తిరుమల శ్రీవారి దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కోటాకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక షెడ్యూల్‌ను ప్రకటించింది. భక్తుల సౌకర్యార్థం వివిధ రకాల దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, వసతి గదుల కోటాను నవంబర్ 18 నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

నవంబర్ 18న ఆర్జిత సేవా టికెట్లు

సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన టికెట్ల కోటాను నవంబర్ 18న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందినవారు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు నగదు చెల్లించాలి.

నవంబర్ 21న సేవలు, వర్చువల్ దర్శనాలు

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటాను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇవి కూడా చదవండి

నవంబర్ 23న ప్రత్యేక దర్శన టోకెన్లు

అంగప్రదక్షిణ టోకెన్లను ఉదయం 10 గంటలకు, శ్రీవాణి దర్శన టికెట్లను 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.

నవంబర్ 24న దర్శన టికెట్లు, గదుల కోటా

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా టికెట్లు, గదులను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Follow Us