ఉద్యోగుల జీతంనుంచి మరో కొత్త కటింగ్.. ఎందుకంటే!
ఉద్యోగుల జీతం నుంచే నేరుగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే కొత్త విధానాన్ని సెబీ ప్రతిపాదించింది. ఉద్యోగి అనుమతితో కంపెనీలు జీతంలో కొంత మొత్తాన్ని కట్ చేసి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఈ విధానం అమల్లోకి వస్తే ఉద్యోగులకు దీర్ఘకాలిక పొదుపు సులభమవుతుందని భావిస్తున్నారు. దీనిపై జూన్ 10 వరకు ప్రజల అభిప్రాయాలు స్వీకరించనున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేసేవారికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) ఒక తీపి కబురు అందించింది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇకపై ఉద్యోగుల పొదుపు ఖాతాలతో సంబంధం లేకుండా, ప్రతి నెలా వచ్చే జీతం నుంచే నేరుగా ప్రావిడెంట్ ఫండ్ మాదిరిగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల మొత్తాన్ని కట్ చేసే సరికొత్త విధానాన్ని ప్రతిపాదించింది. ప్రత్యేక సందర్భాలలో ‘థర్డ్ పార్టీ పేమెంట్ల’కు అనుమతినిస్తూ సెబీ ఒక ముసాయిదా విడుదల చేసింది. ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తే మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే కేవలం వారి సొంత బ్యాంక్ ఖాతా నుండి మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లావాదేవీలన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించిన పేమెంట్ వ్యవస్థలు, సెబీ గుర్తింపు పొందిన క్లియరింగ్ కార్పొరేషన్ల ద్వారా మాత్రమే చేయాలి. దీనివల్ల ఉద్యోగులు ప్రతి నెలా తమ శాలరీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాక, విడిగా ఎస్ఐపీ ద్వారా పెట్టుబడి పెట్టుకోవాల్సి వస్తోంది. పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించిన సెబీ, మనీ లాండరింగ్ నిరోధక చట్టం రూల్స్‌కి లోబడి కీలక ప్రతిపాదనలు చేసింది. అందులో భాగంగా… ఉద్యోగులు అంగీకరిస్తే, వారి నెలవారీ జీతం నుండి కొంత మొత్తాన్ని మినహాయించి , కంపెనీ యాజమాన్యాలు నేరుగా ఆ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఉద్యోగులకు కంపెనీలు కల్పించే వివిధ రకాల పొదుపు మరియు దీర్ఘకాలిక ప్రయోజనాల విధానాలకు అనుగుణంగా ఈ సరికొత్త సదుపాయాన్ని సెబీ డిజైన్ చేసింది. అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు కూడా కార్పొరేట్ సంస్థల ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో వచ్చే ఈ పెట్టుబడులను సులభంగా స్వీకరించేందుకు వీలవుతుంది. సాధారణంగా ఏఎంసీలు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లకు అందించే ట్రయల్ కమీషన్‌ను నగదు రూపంలో ఇస్తాయి. అయితే సెబీ తాజా ప్రతిపాదనలో, పంపిణీదారుల అంగీకారంతో ఆ కమీషన్ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ యూనిట్ల రూపంలోనే చెల్లించే వీలు కల్పించింది. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్లకు కూడా దీర్ఘకాలికంగా పొదుపు ఇంకాపెట్టుబడులు పెంచుకునే మంచి ప్రోత్సాహం లభిస్తుందని సెబీ అంచనా వేస్తోంది. థర్డ్ పార్టీ పేమెంట్ల ద్వారా అక్రమ సొమ్ము మార్కెట్లోకి రాకుండా సెబీ పటిష్ఠమైన సెక్యూరిటీని ప్రతిపాదించింది. డబ్బులు చెల్లించే వ్యక్తి మరియు లబ్ధిదారుడు ఇద్దరూ విధిగా పటిష్ఠమైన కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. అలాగే, ఉద్యోగి నుంచి స్పష్టమైన రాతపూర్వక అనుమతి పత్రం తప్పనిసరి.ఎలాంటి నగదు లావాదేవీలకు అనుమతి ఉండదు. ఆడిట్ చేసేందుకు వీలుగా ఉండే ప్రత్యేక బ్యాంక్ ఖాతాల ద్వారా కేవలం ‘డిజిటల్ పేమెంట్లు’ మాత్రమే జరపాలి. ఈ ముసాయిదా ప్రతిపాదనలపై ప్రజలు, పెట్టుబడిదారులు, పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలను, సూచనలను జూన్ 10 వరకు సెబీకి తెలియజేయవచ్చు. ఉద్యోగుల జీతం నుంచి డబ్బులు కట్ చేసి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టడం ఎంతవరకు సరైనది? ఇది ఉద్యోగుల భవిష్యత్తుకు మేలు చేస్తుందా లేదా? అనే అంశాలపై వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సెబీ తన తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భవనంపై చిక్కుకున్న శునకం.. దిక్కుతోచక విలవిల..
వ్యక్తి కడుపులో రాళ్లగుట్ట..స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్స్ షాక్!
మందుబాబులకు షాక్.. జూన్ 2 తర్వాత వీర బాదుడే!
భవనంపై చిక్కుకున్న శునకం.. దిక్కుతోచక విలవిల..
వ్యక్తి కడుపులో రాళ్లగుట్ట..స్కానింగ్ రిపోర్ట్ చూసి షాక్!
అంతరిక్ష అద్భుతాన్ని మన గ్రామస్తుడు ఫొటో తీసాడు!
టాయిలెట్ లేదని.. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాడు
మృత్యుంజయుడు.. పిడుగు పడినా బతికాడు
పాత ప్యాంటు జేబులో లాటరీ టికెట్.. చివరి నిమిషంలో అద్భుతం
అడవిలో లంకెబిందెలు.. వాటి నిండా బంగారం, వజ్రాలు..

