హైదరాబాద్లోని మాసాబ్ ట్యాంక్లో సీనియర్ న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్పై గుర్తుతెలియని వ్యక్తులు కారుతో బలంగా ఢీకొట్టి హత్యాయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. వక్ఫ్ భూముల వివాదాల నేపథ్యంలో ప్రత్యర్థి వర్గమే ఈ కుట్రకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం దర్యాప్తులు ముమ్మరం చేశారు.