AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 10 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. హైదరాబాద్ టీందే ట్రోఫీ.. ఇదిగో సాక్ష్యం..!

Sunrisers Hyderaba: ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో ఒక అద్భుతమైన, నమ్మశక్యం కాని సరికొత్త సమీకరణం తెరపైకి వచ్చింది. సరిగ్గా పదేళ్ల క్రితం, అంటే 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చాంపియన్‌గా నిలిచినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడు కూడా అవే పునరావృతమయ్యాయి. ఈ సెంటిమెంట్ చూసి ఆరెంజ్ ఆర్మీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

SRH ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 10 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. హైదరాబాద్ టీందే ట్రోఫీ.. ఇదిగో సాక్ష్యం..!
Srh 2016 Hitory Repeat
Venkata Chari
|

Updated on: May 23, 2026 | 6:57 PM

Share

Sunrisers Hyderabad: క్రికెట్ ప్రపంచంలో కొన్నిసార్లు గణాంకాలు, సెంటిమెంట్లు నూటికి నూరు శాతం నిజమవుతుంటాయి. ప్రస్తుతం ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ చేరిన జట్ల స్థానాలను గమనిస్తే, చరిత్ర మళ్లీ రిపీట్ కాబోతోందా అనే అనుమానం రాక మానదు. ఆస్ట్రేలియా దిగ్గజం ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది ట్రోఫీని ముద్దాడుతుందని పాయింట్ల పట్టిక స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. 2016లో హైదరాబాద్ తన ఏకైక ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు ప్లేఆఫ్స్‌లో జట్ల స్థానాలు ఎలా ఉన్నాయో, ఇప్పుడు కూడా అలాగే ఉండటం విశేషం.

2016 వర్సెస్ 2026: ఆ అద్భుతమైన పోలిక ఇదే..!

పదేళ్ల క్రితం నాటి ప్లేఆఫ్స్ చిత్రానికి, ఇప్పటి పాయింట్ల పట్టికను పక్కపక్కన పెట్టి చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. రెండు సీజన్లలోనూ మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు, వాటి వరుస క్రమం అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Video: తూచ్.. వాడిదసలు బౌలింగేనా.. స్టాండ్స్‌లో శివాలెత్తిన కావ్యపాప..

2016 ప్లేఆఫ్స్ సమీకరణం:

మొదటి రెండు స్థానాలు (టాప్-2): గుజరాత్ (అప్పట్లో గుజరాత్ లయన్స్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

మూడో స్థానం (ఎలిమినేటర్): సన్‌రైజర్స్ హైదరాబాద్

2026 ప్లేఆఫ్స్ సమీకరణం (ప్రస్తుత పరిస్థితి):

మొదటి రెండు స్థానాలు (టాప్-2): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్

మూడో స్థానం (ఎలిమినేటర్): సన్‌రైజర్స్ హైదరాబాద్

అప్పట్లోనూ గుజరాత్, బెంగళూరు జట్లు టాప్-2 లో ఉండి క్వాలిఫైయర్-1 ఆడగా, హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ ఆడింది. ఇప్పుడు 2026లోనూ అదే సీన్ పునరావృతమైంది.

నాడు ఎలిమినేటర్ గెలిచి.. నేడు అదే బాటలో..!

ఐపీఎల్ చరిత్రను పరిశీలిస్తే మూడో లేదా నాలుగో స్థానంలో నిలిచిన జట్లు టైటిల్ గెలవడం హిమాలయ పర్వతాన్ని అధిరోహించడంతో సమానం. ఎందుకంటే ఫైనల్ చేరాలంటే వరుసగా రెండు నాకౌట్ మ్యాచ్‌లు (ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2) గెలవాల్సి ఉంటుంది. గత పద్దెనిమిదేళ్ల ఐపీఎల్ చరిత్రలో కేవలం ఒక్కసారి మాత్రమే మూడో స్థానంలో ఉన్న జట్టు విజేతగా నిలిచింది. ఆ అసాధారణ రికార్డును 2016లో డేవిడ్ వార్నర్ నాయకత్వంలో ఇదే సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించింది. అప్పట్లో హైదరాబాద్ మొదట ఎలిమినేటర్ గెలిచి, ఆపై క్వాలిఫైయర్-2 లో విజయం సాధించి, చివరకు చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు జట్టు గుండె పగిలేలా చేసి కప్పు కొట్టింది.

ఇది కూడా చదవండి: ఐపీఎల్‌లో మరో కొత్త ఫ్రాంచైజీ.. ఒకే టీంలోకి ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ? రంగంలోకి భారతీయ బిలియనీర్!

పాట్ కమిన్స్ సేన చరిత్ర సృష్టిస్తుందా?

ప్రస్తుత సీజన్‌లో పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆరెంజ్ ఆర్మీ ఆడుతున్న విధ్వంసకర ఆటతీరు చూసి ప్రత్యర్థి జట్లు అప్పుడే వణికిపోతున్నాయి. ఈ సీజన్ లీగ్ దశలోనే హైదరాబాద్ జట్టు రికార్డు స్థాయిలో ఏకంగా తొమ్మిది సార్లు 200 కంటే ఎక్కువ పరుగులు సాధించి చరిత్ర సృష్టించింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి బ్యాటర్లు టీ20 క్రికెట్‌ను కాస్తా టీ10 తరహాలో ఆడుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. లీగ్ చివరలో కొన్ని సమీకరణాల వల్ల హైదరాబాద్ టాప్-2 రేసులో వెనుకబడి మూడో స్థానానికి పరిమితమైనప్పటికీ, ఈ మాయా సెంటిమెంట్ మాత్రం కమిన్స్ సేనకు ఎలిమినేటర్ మార్గమే ‘రాజమార్గం’ కాబోతుందని చెబుతోంది.

గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆస్ట్రేలియా కెప్టెన్ డేవిడ్ వార్నర్ సారథ్యంలోనే కప్పు గెలిచింది. ఇప్పుడు కూడా ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ అద్భుతమైన కాకతాళీయాలు, పాత సెంటిమెంట్లు నిజమై హైదరాబాద్ జట్టు రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంటుందో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందా? రూ.50 లక్షలు వస్తాయని తెలుసా?
మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందా? రూ.50 లక్షలు వస్తాయని తెలుసా?
పిల్లలు వద్దనుకోవడం నిజంగా పాపమా? అసలు నిజం ఏమిటి?
పిల్లలు వద్దనుకోవడం నిజంగా పాపమా? అసలు నిజం ఏమిటి?
10 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. హైదరాబాద్‌దే ట్రోఫీ.. ఇదిగో సాక్ష్యం
10 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. హైదరాబాద్‌దే ట్రోఫీ.. ఇదిగో సాక్ష్యం
రోజంతా ఫోన్ చేతిలోనే ఉంటుందా..? మీ శరీరం ఇచ్చే 4 డేంజర్ సిగ్నల్స్
రోజంతా ఫోన్ చేతిలోనే ఉంటుందా..? మీ శరీరం ఇచ్చే 4 డేంజర్ సిగ్నల్స్
సంపద వరదలా వచ్చే గజకేసరి యోగం.. ఈ లక్కీ రాశుల్లో మీరు ఉన్నారా..?
సంపద వరదలా వచ్చే గజకేసరి యోగం.. ఈ లక్కీ రాశుల్లో మీరు ఉన్నారా..?
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జూన్ 30లోగా ఇది చేయకపోతే..
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జూన్ 30లోగా ఇది చేయకపోతే..
నాగార్జున నా ముఖం మీద సిగరెట్ పొగ ఊది ఐలవ్యూ చెప్పాడు
నాగార్జున నా ముఖం మీద సిగరెట్ పొగ ఊది ఐలవ్యూ చెప్పాడు
తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎస్బీఐ అప్రెంటీస్ ఖాళీలు.. స్టైపెండ్..
తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎస్బీఐ అప్రెంటీస్ ఖాళీలు.. స్టైపెండ్..
హైదరాబాద్‌లో లాయర్ దారుణ హత్య.. కారు ఎక్కుతుండగా..
హైదరాబాద్‌లో లాయర్ దారుణ హత్య.. కారు ఎక్కుతుండగా..
ఇంట్లోనే టమాటా మొక్కల్ని పెంచొచ్చు.. కాపుకు గంపలు నిండుతాయ్
ఇంట్లోనే టమాటా మొక్కల్ని పెంచొచ్చు.. కాపుకు గంపలు నిండుతాయ్