AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi movie : ఏం రాసావ్ భయ్యా.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న చికిరి సాంగ్.. ఈ పాటను మీరు పాడేయ్యండి..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మారుమోగుతున్న సాంగ్ చికిరి.. అలాగే చిన్నా, పెద్దా అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్న ఈపాటలోని రామ్ చరణ్ హుక్ స్టెప్ సైతం తెగ పాపులర్ అయ్యింది. ఇప్పుడు నెట్టింట చికిరి వైబ్ కనిపిస్తోంది. ఇటీవల పెద్ది సినిమా నుంచి విడుదలైన ఈ పాట మ్యూజిక్ మాత్రమే కాదు.. లిరిక్స్ సైతం అదిరిపోయాయి. ఈ పాటను మీరు ఇప్పుడు ఈజీగా పాడేయ్యండి.

Peddi movie : ఏం రాసావ్ భయ్యా.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న చికిరి సాంగ్.. ఈ పాటను మీరు పాడేయ్యండి..
Chikiri Song
Rajitha Chanti
|

Updated on: Nov 10, 2025 | 6:43 PM

Share

ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తుంది చికిరి సాంగ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది సినిమాలోనిది ఈ పాట. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. అలాగే కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. ముందు నుంచి ఈ మూవీపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల గురువారం (నవంబర్ 7న ) విడుదలైన పెద్ది ఫస్ట్ లిరికల్ సాంగ్ ఇప్పుడు తెగ వైరలవుతుంది. ఈ సాంగ్ అదిరిపోయిందంటూ నెట్టింట వీడియోస్ షేర్ చేస్తున్నారు. అంతేకాదు.. ఇందులో చరణ్ చేసిన హుక్ స్టెప్ తో రీల్స్ చేస్తున్నారు. మరోవైపు చికిరి సాంగ్ 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ మూవీ సాంగ్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఈ పాటకు 50 మిలియన్ వ్యూస్ కు పైగా వచ్చాయి. ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతున్న చికిరి సాంగ్ లిరిక్స్ యూత్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క.. నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా..

దీని అందాలో లెక్క.. దీని వేషాలో తిక్క.. నా గుండెల్లో పోతోందే ఉక్క..

ఓ.. చికిరి చికిరి చికిరి.. చికిరి చికిరి చికిరి..

పడతా పడతా పడతా.. వెనకే వెనకే పడతా

సరుకు సామాను చూసి.. మీసం లేచి వేసే కేక..

చికిరి చికిరి గుండె సురకేట్టేసాక..

ముందు వెనకా ఈడే.. గాలి తొక్కేసిందే పిల్లా

చికిరి చికిరి ఆడంగుల మచ్చయిందిలా..

ఆ చంద్రుల్లో ముక్క.. జారిందే దీనక్క.. నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా

చరణం 1 :

ఆ ముక్కు పై పెట్టి కోపం.. తొక్కేసావే ముక్కెర అందం..

చింతాకులా ఉందే పాదం.. చిరాకులే నడిచే వాటం

ఏం బుగ్గవో అందాలు.. ఒళ్ళంతా వంకీలు

నీ మత్తే తాగిందా తాటి కల్లు..

కూసింతే చూత్తే నీలో వగలు.. రాసేత్తారుగా ఎకరాలు..

నువ్వే నడిచిన సోటంతా పొర్లు దండాలు..

ఓ చికిరి చికిరి చికిరి.. చికిరి చికిరి చికిరి

పడతా పడతా పడతా.. వెనకే వెనకే పడతా

ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క.. నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా

దీని అందాలో లెక్క దీని వేషాలో తిక్క.. నా గుండెల్లో పోతోందే ఉక్క

చరణం 2:

నచ్చేసావే మల్లెగంప.. నీ అందాలే నాలో దింప..

ఏం తిన్నావో కాయ దుంప.. నీ యవ్వారం జరదా ముంప

నీ చుట్టూరా కళ్ళేసి.. లోగుట్టే నమిలేసి..

లొట్టెసి ఊరాయి.. నోట నీళ్లు..

నీ సింగారాన్ని చూత్తావుంటే.. సొంగకార్చుకుందే..

గుండె బెంగ నిదరని మింగే హంగే.. చెయ్యలేసే చెయ్యలేసే

చికిరి చికిరి చికిరి.. చికిరి చికిరి చికిరి..

పడతా పడతా పడతా.. వెనకే వెనకే పడతా

ఆ చంద్రుల్లో ముక్క.. జారిందే దీనక్క.. నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా

దీని అందాలో లెక్క.. దీని వేషాలో తిక్క.. నా గుండెల్లో పోతోందే ఉక్క

ఓ చికిరి చికిరి చికిరి.. చికిరి చికిరి చికిరి

పడతా పడతా పడతా.. వెనకే వెనకే పడతా

సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక

చికిరి చికిరి గుండె.. సురకేట్టేసాక

చిత్రం: పెద్ది

సాంగ్ : చికిరి చికిరి

సంగీత దర్శకుడు: ఏఆర్ రెహమాన్

సింగర్ : మోహిత్ చౌహాన్

సాహిత్యం : బాలాజీ

నటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్.

రచయిత, దర్శకుడు: బుచ్చిబాబు

నిర్మాత: వెంకట సతీష్ కిలారు

ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..