AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC: హీరోగా రూ.35 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్న డైరెక్టర్.. ఎవరో తెలుసా..?

యాక్షన్, కట్, ప్యాకప్.. సినిమా తీసేటప్పుడు ఇది డైరెక్టర్ చేసేది. కథ, డైలాగ్స్, పాటలు, సంగీతం.. వీటన్నింటినీ సమపాళ్లలో సినీ ప్రేమికులకు నచ్చేలా సినిమాను తెరకెక్కించడం ఇవన్నీ దర్శకుడి ప్రాథమిక విధులు. దర్శకుడు ఏం చెప్పినా స్క్రీన్ మీద కనిపించేది మాత్రం నటీనటులే. అంటే తెరముందు హీరోహీరోయిన్లు ఎవరైనా.. తెరవెనుక ఉండే హీరో మాత్రం సినిమాకు దర్శకుడే..

DC: హీరోగా రూ.35 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్న డైరెక్టర్.. ఎవరో తెలుసా..?
Lokesh Kanagaraj1
Nikhil
|

Updated on: Nov 15, 2025 | 10:13 PM

Share

టాలీవుడ్ దర్శకులు హీరోలుగా మారడం కొత్తేమీ కాదు, కానీ ఈసారి ఆ లిస్టులో చేరబోతున్నవారు మరింత స్పెషల్! తన దర్శకత్వంతో పలు సూపర్ హిట్స్ అందించి, ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన ఈ డైరెక్టర్ ఇప్పుడు కెమెరా వెనుక నుంచి ముందుకు వచ్చేస్తున్నారు.

హీరోగా డెబ్యూ చేయడానికి సిద్ధమవుతున్న ఈ టాలెంటెడ్ పర్సనాలిటీ, తన కథలు చెప్పిన విధానంతోనే కాకుండా, ఇప్పుడు తన యాక్టింగ్ స్కిల్స్‌తో అందరినీ ఆకట్టుకోబోతున్నారు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక ఉన్న సీక్రెట్ స్టోరీ, ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం..

డైరెక్టర్​గా వరుస హిట్లతో సినీఇండస్ట్రీని షేక్​ చేసి ఇప్పుడు హీరోగానూ తానేంటో నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. బ్లాక్‌బస్టర్లతో యంగ్ జనరేషన్‌ను ఆకట్టుకున్న ఈ డైరెక్టర్, ఇప్పుడు తన రియల్ లైఫ్ హీరోగా అవతరించబోతున్నారు. ఆయన స్క్రిప్ట్ రాసే స్టైల్, ఎమోషన్స్ హ్యాండిల్ చేసే విధానం.. ఇవన్నీ ఇప్పుడు స్క్రీన్ మీద ఆయన యాక్టింగ్‌లో కనిపించబోతున్నాయి.

అయితే ఈ డైరెక్టర్​ కమ్​ హీరో తన మొదటి సినిమాకు తీసుకుంటున్న పారితోషికం మాత్రం ఇండస్ట్రీలో హాట్​ టాపిక్​గా మారిపోయింది. డైరెక్టర్​గా మొదటి సినిమాకి కేవలం 20 లక్షలు తీసుకుని ఇప్పుడు హీరోగా మాత్రం 35 కోట్లు తీసుకుంటున్నాడని సినీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఇంతకీ ఆ డైరెక్టర్​ ఎవరో తెలుసా? ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలనందించిన కోలీవుడ్​ స్టార్​ డైరెక్టర్​ లోకేష్​ కనగరాజ్​.

హీరోలు డైరెక్టర్​లుగా, డైరెక్టర్​లు హీరోలుగా చేయడం కొత్తేం కాదు. అయితే స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ ప్రయోగం చేయడం విశేషమే. అరుణ్ మాథీశ్వరన్ దర్శకత్వంలోని ‘DC’లో నటించనున్న అతను, తన మొదటి సినిమాకి 20 లక్షలు తీసుకున్న దర్శకుడు, ఇప్పుడు 35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే నటుడుగా మారడం ఒక విప్లవాత్మక మార్పు. ఇది కేవలం వృత్తిగత మార్పు కాదు, కోలీవుడ్ సినిమా నియమాలను మార్చే ఒక కొత్త అధ్యాయం.

అరుణ్ మథేశ్వరన్ డైరెక్షన్‌లో ‘డీసీ’ (DC) అనే యాక్షన్ రొమాన్స్‌లో లోకేష్ ‘దేవదాస్’ పాత్రలో కనిపించబోతున్నాడు. వామికా గబ్బీ ‘చంద్ర’ పాత్రలో హీరోయిన్‌గా జతపరుస్తోంది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామా రంగంలో బాన్నీ అండ్ క్లైడ్ స్టైల్ లవ్ స్టోరీగా రూపొందుతోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, ముకేష్ జి. సినెమాటోగ్రఫీ, జీకే ప్రసాద్ ఎడిటింగ్ – టీమ్ స్టార్. థాయ్‌లాండ్‌లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్న లోకేష్, యాక్షన్ సీన్స్‌లో ఫుల్ ఫైర్ చేయబోతున్నాడు.

Lokesh Kanagaraj

Lokesh Kanagaraj

టైటిల్ టీజర్‌లో రగ్డ్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఎక్సైట్ చేశాడు. షూటింగ్ జనవరి 2026 వరకు పూర్తవుతుందని, 2026లో రిలీజ్ అవకాశం ఉందని సమాచారం. లోకేష్ యాక్టింగ్ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ డెబ్యూ ఇండస్ట్రీని షేక్ చేయబోతుందా? వెయిట్ అండ్ వాచ్!