Cinema : ప్రియుడితో కలిసి అత్త హత్య.. కొడలిపై మామ భయంకరమైన ప్రతీకారం.. ఓటీటీలో ఈ సినిమా చూస్తే వణుకే..
ప్రస్తుతం ఓటీటీలో ఓ క్రైమ్ త్రిల్లర్ సినిమా దూసుకుపోతుంది. తన ప్రియుడితో కలిసి అత్తను హత్య చేస్తుంది ఓ కోడలు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. తన కోడలి గురించి నిజం తెలుసుకున్న ఆమె మామ.. తనకు ఎలాంటి శిక్ష విధించాడు.. ? ఎంత భయంకరంగా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది సినిమా. కేవలం మూడు పాత్రల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో చాలా సినిమాలు అందుబాటులో ఉన్నాయి.ఈ మధ్య కాలంలో హారర్, సస్పెన్స్, త్రిల్లర్ సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. ఇది మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా కథ ఒక వివాహిత, తన ప్రేమికుడితో కలిసి తన అత్తగారిని చంపే కథ చుట్టూ తిరుగుతుంది. ఆ రాత్రి ఆమె బ్రతికిందా లేదా అనేది ఈ సినిమా ప్రధాన అంశం. ఇది మలయాళ చిత్రం “ఉడల్”. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సినిమాలోని నిరంతర మలుపులు ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం షాక్‌కు గురి చేస్తుంది. ఇది హారర్ సినిమా కాకపోయినా, హారర్ సినిమాలలో కనిపించే థ్రిల్లింగ్ క్షణాలను కలిగి ఉండటం ఒక ప్లస్ పాయింట్.
దుర్గా కృష్ణ, దయన్ శ్రీనివాసన్, ఇంద్రాన్స్ మూడు ప్రధాన పాత్రల చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. అనారోగ్యంతో మంచం పట్టిన తన అత్తను తన ప్రియుడి సాయంతో చంపేస్తుంది కోడలు. తన మామ అంధుడు కావడంతో అతడికి తెలియకుండా తన అత్తను చంపేందుకు ప్లాన్ చేస్తుంది. కానీ కోడలు గురించి నిజం తెలుసుకున్న ఆమె మామ.. కోడలిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నారు అనేది సినిమా. ఈ సినిమాలో వచ్చే ప్రతీ సీన్ ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తాయి.
ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. రతీష్ రఘునందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టదు. ఆద్యంతం ఊహించని ట్విస్టులతో సాగుతుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం జనాలకు షాకిస్తుంది.
Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..




