Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..
చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించారు.. ఇప్పుడేమో హీరోహీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. మరికొందరు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ విభిన్న రంగాలను ఎంచుకున్నారు. అయితే రామ్ చరణ్ నటించిన రచ్చ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు గ్లామర్ ఫోజులతో నెట్టింట రచ్చ చేస్తుంది. ఇంతకీ ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ?

ప్రస్తుతం తెలుగులో చైల్డ్ ఆర్టిస్టులు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో బాలనటీనటులుగా అలరించిన తారలు.. ఇప్పుడు మరోసారి తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే అందులో కొందరు సక్సెస్ కాగా.. మరికొందరు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తు్న్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. పైన ఫోటోలో చూశారు కదా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమన్నా నటించిన రచ్చ సినిమాలో నటించింది. ఇందులో తమన్నా చిన్నప్పటి పాత్రను పోషించింది. ఈ అమ్మాయి పేరు విశికా కోటా. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు సినీప్రియులను అలరించిన ఈ అమ్మాయి.. ఇప్పుడు హీరోయిన్ అయ్యింది.. ఇంతకీ ఆమె నటించిన చిత్రాలు ఏంటో తెలుసుకుందామా.
రచ్చ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన ఈ అమ్మాయి.. ఏందిరా ఈ పంచాయితీ, సగిలేటి కథ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అలాగే మరికొన్ని సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. విశికా 1998 జూలై 19న హైదరాబాద్ లో జన్మించింది. గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత నటనవైపు అడుగులు వేసింది. సినీరంగంలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది.
View this post on Instagram
పాత్రా ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ నటిగా మంచి మార్కులు కొట్టేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అయితే ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం సరైన ఛాన్సుల కోసం వెయిట్ చేస్తుంది.
View this post on Instagram
Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..




