AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Rai: ఐశ్వర్య ముద్దుల కూతురు ఇప్పుడు ఎన్నో తరగతి చదువుతుందో తెలుసా? నెలకు స్కూల్ ఫీజు ఎంతంటే?

ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ ముంబైలోని ప్రతిష్టాత్మక ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతోంది. ఆమెతో పాటు పలువురు సినీ ప్రముఖుల పిల్లలు కూడా ఇదే స్కూల్ లో చదువుకుంటున్నారు. మరి ఆరాధ్య చదువు కోసం ఐశ్వర్య దంపతులు నెలకు ఎన్ని లక్షలు చెల్లిస్తున్నారో తెలుసా?

Aishwarya Rai: ఐశ్వర్య ముద్దుల కూతురు ఇప్పుడు ఎన్నో తరగతి చదువుతుందో తెలుసా? నెలకు స్కూల్ ఫీజు ఎంతంటే?
Aishwarya Rai Family
Basha Shek
|

Updated on: Nov 19, 2025 | 8:25 PM

Share

బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల ముద్దుల కూతురు ఆరాధ్య ఇటీవలే తన 14వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంది. కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈ స్టార్ కిడ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. బచ్చన్ ఫ్యామిలీలో ఈ మధ్యన బాగా హైలెట్ అవుతున్నది ఐశ్వర్య కూతురే. ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇప్పటికే బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆరాధ్య ఇప్పుడేం చదువుకుంటుందో తెలుసుకుందాం రండి.

బాలీవుడ్ సెలబ్రిటీల పిల్లల్లో చాలా మంది ముంబై నగరంలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతారు. ఇక అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా ఈ స్కూల్‌లో చదువుతుంది. ఆరాధ్య నవంబర్ 16, 2011న జన్మించింది. ఆమెకు ఇప్పుడు 14 సంవత్సరాలు. ఆరాధ్య ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతుంది. ఆమెతో పాటు, ఇతర సెలబ్రిటీ పిల్లలు కూడా ఈ పాఠశాలలోనే చదువుతున్నారు. ఆరాధ్య నర్సరీ నుంచి ఈ పాఠశాలలోనే చదువుతోంది. ప్రస్తుతం ఆమె ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇక అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజులు లక్షల రూపాయలలో ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐశ్వర్య, అభిషేక్ లు తమ కుమార్తె చదువు కోసం ప్రతి నెలా రూ. 4.5 లక్షలు ఫీజు చెల్లిసస్తున్నారని టాక్.

కూతురు ఆరాధ్యతో ఐశ్వర్యారాయ్ బచ్చన్..

నెలకు అన్ని లక్షల రూపాయలా?

ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నర్సరీ నుంచి ఏడవ తరగతి వరకు నెలకు దాదాపు రూ.1.70 లక్షలు వసూలు చేస్తుంది. ఆ తర్వాత, ఎనిమిదో తరగతి నుండి ఉన్నత పాఠశాల పూర్తయ్యే వరకు నెలకు రూ.4.5 లక్షలు వసూలు చేస్తుంది. ఫీజులకు తగ్గట్టుగానే ఈ పాఠశాలలో విద్యార్థులకు అనేక సౌకర్యాలు, సదుపాయాలు ఉన్నాయి. ఆరాధ్య తన పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో చాలాసార్లు డ్యాన్స్ లు చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత సంవత్సరం, ఆరాధ్య షారుఖ్ ఖాన్ కుమారుడు అబ్‌రామ్‌తో కలిసి వేదికపై ఒక నాటకాన్ని ప్రదర్శించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..