AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అలాగే బుల్లితెరపై కూడా సందడి చేసింది. కొన్ని నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ అందాల తార ఇప్పుడు తల్లిగా ప్రమోషన్ పొందనుంది.

Tollywood: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?
Bigg Boss Telugu Fame Soniya Akula
Basha Shek
|

Updated on: Nov 19, 2025 | 10:03 PM

Share

పై ఫొటోలో బేబీ బంప్ తో కనిపిస్తోన్న దెవరో గుర్తు పట్టారా? ఠక్కున చూస్తే గుర్తుపట్టకపోవచ్చు.. కానీ తీక్షణంగా చూస్తే ఆమె ఎవరో ఈజీగా గుర్తు పట్టవచ్చు. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో చూసే వారికి ఈ ముద్దుగుమ్మ బాగా పరిచయం. ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఈ తెలుగమ్మాయి తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. అంతకు ముందు పలు సినిమాల్లోనూ కథానాయికగా, సహాయక నటిగా చేసింది. సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే..ఈ అందాల తార ఇప్పుడు అమ్మగా ప్రమోషన పొందనుంది. గతేడాది తన ప్రియుడితో కలిసి పెళ్లిపీటలెక్కిన ఆమె కొన్ని నెలల క్రితమే గర్భం దాల్చింది. త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు రెడీ అవుతోన్న ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు సోనియా ఆకుల.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సోనియా ఆకుల ఒకరు. ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిందీ అందాల తార. విజేతగా నిలవకపోయినా తన ఆట, మాట తీరుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే తన ప్రియుడు యశ్ వీర్ గ్రోనీని తో కలిసి పెళ్లి పీటలెక్కింది సోనియా. ఇప్పుడు తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారీ లవ్లీ కపుల్. కొన్ని రోజుల క్రితమే గర్భం ధరించిన శుభవార్తను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిందీ బిగ్ బాస్ బ్యూటీ. ఆ తర్వాత సీమంతం కూడా జరగ్గా, ఆ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా బేబీ బంప్ తో ఉన్న మరిన్ని ఫొటోలు పంచుకుంది సోనియా. ఇప్పుడీ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

బేబీ బంప్ ఫొటోలతో సోనియా ఆకుల..

సీమంతం వేడుకల్లో బిగ్ బాస్ బ్యూటీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !