AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ మారుతుందా? కమిషన్ కీలక ప్రకటన

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల సిలబస్‌పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. సిలబస్‌లో మార్పులు చేసేందుకు ప్రస్తుతం ఎలాంటి కమిటీని నియమించలేదని సెప్టెంబరు 21న స్పష్టం చేసింది. సిలబస్‌లో ఏమైనా కీలక మార్పులు చేయాల్సి వస్తే అభ్యర్థులకు కనీసం ఏడాది ముందుగానే సమాచారం అందిస్తామని వెల్లడించింది..

TGPSC గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ మారుతుందా? కమిషన్ కీలక ప్రకటన
Clarification on TGPSC Syllabus Changes
Srilakshmi C
|

Updated on: Sep 24, 2026 | 6:00 PM

Share

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల సిలబస్‌పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. సిలబస్‌లో మార్పులు చేసేందుకు ప్రస్తుతం ఎలాంటి కమిటీని నియమించలేదని సెప్టెంబరు 21న స్పష్టం చేసింది. సిలబస్‌లో ఏమైనా కీలక మార్పులు చేయాల్సి వస్తే అభ్యర్థులకు కనీసం ఏడాది ముందుగానే సమాచారం అందిస్తామని వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల సిలబస్‌లో టీజీపీఎస్సీ మార్పులు చేస్తోందా? అంటూ అభ్యర్థుల నుంచి కమిషన్‌కు విజ్ఞాపనలు, విచారణలు వస్తున్నాయి. సిలబస్‌ మార్పులపై సామాజిక మాధ్యమాల్లో, ఇతర వేదికల్లో అసత్య ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో టీజీపీఎస్సీ ఈ వివరణ ఇచ్చింది.

గతంలో సిలబస్‌లో మార్పులు

టీజీపీఎస్సీ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలకు సంబంధించి తొలి కమిషన్‌ సిలబస్‌ను రూపొందించింది. అప్పటి ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో రూపొందించిన సిలబస్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోటీ పరీక్షలకు అభ్యర్థులు సిద్ధమయ్యేలా, తెలంగాణకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఉండే విధంగా రూపొందించారు. ఆ తర్వాత జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలోని రెండో కమిషన్‌ గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పరీక్షల సిలబస్‌లో స్వల్ప మార్పులు చేసింది. అదే సమయంలో నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి

నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఊహాగానాలు

సిలబస్‌లో గత మార్పులు జరిగి దాదాపు నాలుగేళ్లు కావడంతో మరోసారి సిలబస్‌ను మార్చే అవకాశం ఉందంటూ అభ్యర్థుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సిలబస్‌పై స్పష్టత ఇవ్వాలని పలువురు అభ్యర్థులు టీజీపీఎస్సీని కోరారు. ప్రస్తుతం సిలబస్‌ మార్పుల కోసం ఎలాంటి కమిటీని నియమించలేదని కమిషన్‌ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఏవైనా కీలక మార్పులు చేపట్టాల్సి వస్తే వాటిని అభ్యర్థులకు ముందుగానే, కనీసం ఏడాది ముందు తెలియజేస్తామని పేర్కొంది. దీంతో సిలబస్‌ మార్పులపై వస్తున్న ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారం కోసం టీజీపీఎస్సీ ప్రకటనలను మాత్రమే అనుసరించాలని అభ్యర్థులు సూచిస్తున్నారు.

Follow Us