AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ బంద్.. వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ముందే జాగ్రత్త పడండి..

యూపీఐ వాడేవారికి బ్యాడ్ న్యూస్. అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా వ్యాపార సంఘాలు యూపీఐ ఛార్జీలపై ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా క్యూఆర్ కోడ్, సౌండ్ బాక్స్‌లపై నల్లటి వస్త్రం కప్పి నిరసన తెలియచేయనున్నారు. దీని వల్ల యూపీఐ పేమెంట్స్ చేయడంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది.

UPI Payments: దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ బంద్.. వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ముందే జాగ్రత్త పడండి..
Upi Payments
Venkatrao Lella
|

Updated on: Sep 24, 2026 | 6:16 PM

Share

కేంద్ర ప్రభుత్వం వ్యాపారుల వద్ద యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధింపునకు సిద్దమైంది. అక్టోబర్ 15 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. అయితే ఈ చార్జీలపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాపార సంఘాలు అక్టోబర్ 2న యూపీఐ రహిత దినం పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు వ్యాపారులు క్యూఆర్ కోడ్, స్కానర్లు, సౌండ్ బాక్సులను నల్లటి వస్త్రంతో కప్పి ఉంచి నిరసన తెలియచేయనున్నారు. చిల్లర వ్యాపారులతో పాటు నగల, వంటనూనె వ్యాపారులు ఈ నిరసనల్లో పాల్గొననున్నారు.

అయితే అక్టోబర్ 15వ తేదీ నుంచి ఎండీఆర్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రూ.2 వేలు దాటిన మర్చంట్ పేమెంట్లకు 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీలు విధించనున్నారు. గరిష్ట పరిమితి రూ.300 ఫిక్స్ చేశారు. రూ.2 వేల కంటే కంటే తక్కువ చేసే పేమెంట్లు ఉచితంగానే నిర్వహించుకోవచ్చు. ఇక చిన్న వ్యాపారులకు నెలకు రూ.లక్ష పరిమితి వరకు ఉచితంగా చేసుకోవచ్చు. కానీ తక్కువ లాభాలతో నెట్టుకొస్తున్నవారికి యూపీఐ ఛార్జీలు భారంగా మారతాయని వ్యాపారులు చెబుతున్నారు. రిటైలర్లు, పంపిణీదారులు డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని ప్రోత్సహిస్తుండగా.. తాము ఎందుకు అదనపు భారాన్ని ఎందుకు మోయాలని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు పెట్రోల్ డీలర్లు కూడా తమకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్‌తో పెట్రోలియం మంత్రిత్వశాఖ చర్చలు జరుపుతోంది.

అలాగే స్టాక్ బ్రోకర్లు కూడా యూపీఐ ఛార్జీలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సెబీ వారి సమస్యలపై దృష్టి పెట్టింది. ఇక నూనె వ్యాపారులు కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. డిజిటల్ చెల్లింపులు వినియోగదారుడి నుండి సరఫరాదారుడి వరకు స్పష్టమైన రికార్డును ఉంచుతాయని చెబుతున్నారు. రుసుము విధించడం పారదర్శక వ్యవస్థను ఉపయోగించే వ్యాపారాలను శిక్షించినట్లు అవుతుందని అంటున్నారు. అక్టోబర్ 2న నిరసనలు చేపట్టనుండగా.. ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఎండీఆర్ ఛార్జీల విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నిర్ణయం నగదు రహిత లావాదేవీల దిశగా జరుగుతున్న ప్రయత్నాలను బలహీనపరుస్తుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు పర్సన్ టు వ్యాపారుల మధ్య జరిగే లావాదేవీలు ఉచితంగా అందించారు. కానీ ఇప్పటినుంచి వ్యాపారుల వద్ద రూ.2 వేలకు మించి చేసే లావాదేవీలకు ఛార్జీలు విధిస్తారు. వీటిని వ్యాపారులు బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లకు చెల్లించాలి.

Follow Us
యూపీఐ పేమెంట్స్ బంద్..? పలు ప్రాంతాల్లో సేవలకు అంతరాయం..
యూపీఐ పేమెంట్స్ బంద్..? పలు ప్రాంతాల్లో సేవలకు అంతరాయం..
షార్క్‌ల మధ్య యువకుడి ప్రపోజల్ .. షాక్‌లో యువతి!
షార్క్‌ల మధ్య యువకుడి ప్రపోజల్ .. షాక్‌లో యువతి!
TGPSC గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ మారుతుందా? కమిషన్ క్లారిటీ
TGPSC గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ మారుతుందా? కమిషన్ క్లారిటీ
కేవలం 10 నిమిషాల్లో చేసే దూదిలాంటి అటుకుల దోశలు..
కేవలం 10 నిమిషాల్లో చేసే దూదిలాంటి అటుకుల దోశలు..
2027లో ప్రపంచ టాప్ డెస్టినేషన్స్‌లో భారత్.. ఈ రెండు ప్రాంతాలకే..
2027లో ప్రపంచ టాప్ డెస్టినేషన్స్‌లో భారత్.. ఈ రెండు ప్రాంతాలకే..
తులా రాశిలో బుధుడు.. ఈ రాశుల వారికి కష్టనష్టాల నుంచి విముక్తి
తులా రాశిలో బుధుడు.. ఈ రాశుల వారికి కష్టనష్టాల నుంచి విముక్తి
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ టార్గెట్‌గా అభిజీత్‌ దిప్కే కీలక వ్యాఖ్యలు
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ టార్గెట్‌గా అభిజీత్‌ దిప్కే కీలక వ్యాఖ్యలు
ఇంటి గోడల్లో, నేల కింద, ఫర్నిచర్ లో డబ్బే డబ్బు.. మాఫియా ఇళ్లల్లో
ఇంటి గోడల్లో, నేల కింద, ఫర్నిచర్ లో డబ్బే డబ్బు.. మాఫియా ఇళ్లల్లో
ఖైరతాబాద్‌ బడా గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం
ఖైరతాబాద్‌ బడా గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం
మెగా హీరోను కాపాడిన అబ్దుల్ ఫ‌ర్హాన్‌ ఇప్పుడేం చేస్తున్నాడు?
మెగా హీరోను కాపాడిన అబ్దుల్ ఫ‌ర్హాన్‌ ఇప్పుడేం చేస్తున్నాడు?