AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2027లో టూరిస్టుల ఫేవరెట్ డెస్టినేషన్స్.. భారత్ నుంచి ఈ రెండు ప్రాంతాలకే చోటు! ఏంటా ప్లేసెస్?

Lonely Planet Best in Travel 2027 India: 2027లో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రాంతాల జాబితాలో భారత్‌కు చెందిన డార్జిలింగ్, గుజరాత్‌కు చోటు దక్కింది. టాయ్ ట్రైన్ జర్నీ నుంచి రన్ ఆఫ్ కచ్, గిర్ అడవుల వరకు ఈ ప్రాంతాల ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.

2027లో టూరిస్టుల ఫేవరెట్ డెస్టినేషన్స్.. భారత్ నుంచి ఈ రెండు ప్రాంతాలకే చోటు! ఏంటా ప్లేసెస్?
Lonely Planet Best In Travel 2027 India
Rajashekher G
|

Updated on: Sep 24, 2026 | 5:50 PM

Share

Best Travel Destinations in India 2027: ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ.. కొన్ని ప్రదేశాలు ప్రత్యేకమైన అనుభూతులను అందిస్తాయి. ప్రకృతి అందాలు, చరిత్ర, సంస్కృతి, ఆహారం, స్థానిక సంప్రదాయాల కలయికతో పర్యాటకులను ఆకట్టుకునే ప్రాంతాలను ప్రతి ఏడాది ప్రముఖ ట్రావెల్ గైడ్ సంస్థలు ప్రత్యేకంగా గుర్తిస్తుంటాయి. ఈ క్రమంలో లోన్లీ ప్లానెట్ (Lonely Planet) Best in Travel 2027 జాబితాలో భారత్‌కు చెందిన రెండు ప్రత్యేక పర్యాటక ఆకర్షణలకు చోటు దక్కింది. భారత్ నుంచి గుజరాత్ 2027లో సందర్శించాల్సిన 25 గమ్యస్థానాల్లో ఒకటిగా ఎంపికైంది. అలాగే పశ్చిమ బెంగాల్‌లోని ప్రసిద్ధ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేను 2027లో అనుభవించాల్సిన 25 ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్‌లలో చేర్చారు.

డార్జిలింగ్‌లో టాయ్ ట్రైన్ జర్నీ

హిమాలయాల అందాల మధ్య ఉన్న డార్జిలింగ్‌కు దేశ, విదేశీ పర్యాటకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. మంచుతో మెరిసే పర్వతాలు, పచ్చని టీ తోటలు, వలస పాలన కాలం నాటి భవనాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడి ప్రత్యేకతలు. అయితే డార్జిలింగ్ ట్రిప్‌లో ‘టాయ్ ట్రైన్ ప్రయాణం’ ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. 19వ శతాబ్దం నుంచి కొనసాగుతున్న డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే.. పర్వతాల మధ్య వంకరలు తిరిగే మార్గంలో ప్రయాణిస్తూ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూపిస్తుంది. ఇది యునెస్కో గుర్తింపు పొందిన Mountain Railways of Indiaలో భాగం. డార్జిలింగ్‌ను సందర్శించేందుకు సాధారణంగా అక్టోబర్–నవంబర్, మార్చి–ఏప్రిల్ నెలలు అనుకూలంగా ఉంటాయి.

గుజరాత్‌లో చరిత్ర నుంచి ప్రకృతి వరకు..

2027లో సందర్శించాల్సిన గమ్యస్థానాల్లో గుజరాత్‌కు చోటు దక్కడానికి అక్కడి వైవిధ్యమే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఒకవైపు రాన్ ఆఫ్ కచ్ ఉప్పు ఎడారి, మరోవైపు గిర్ అడవులు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. వీటితో పాటు పురాతన దేవాలయాలు, స్టెప్‌వెల్స్, చారిత్రక కట్టడాలు, హస్తకళలు, వస్త్ర సంప్రదాయాలు, స్థానిక వంటకాలు గుజరాత్ పర్యటనను ప్రత్యేకంగా మారుస్తాయి. ఇండస్ వ్యాలీ నాగరికతకు సంబంధించిన ప్రదేశాలు, మధ్యయుగ నిర్మాణాలు కూడా చరిత్రపై ఆసక్తి ఉన్నవారిని ఆకర్షిస్తాయి.

గుజరాత్ పర్యటనకు సాధారణంగా అక్టోబర్ నుంచి మార్చి వరకు అనుకూల కాలంగా భావిస్తారు. ముఖ్యంగా శీతాకాలంలో రాన్ ఆఫ్ కచ్ ప్రాంతాన్ని సందర్శించడం ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.

ఇలా 2027లో లోన్లీ ప్లానెట్ జాబితాలో భారత్‌కు చెందిన డార్జిలింగ్ రైల్వే, గుజరాత్ చోటు సంపాదించడంతో దేశంలోని ఈ రెండు విభిన్న పర్యాటక అనుభవాలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Follow Us
2027లో ప్రపంచ టాప్ డెస్టినేషన్స్‌లో భారత్.. ఈ రెండు ప్రాంతాలకే..
2027లో ప్రపంచ టాప్ డెస్టినేషన్స్‌లో భారత్.. ఈ రెండు ప్రాంతాలకే..
తులా రాశిలో బుధుడు.. ఈ రాశుల వారికి కష్టనష్టాల నుంచి విముక్తి
తులా రాశిలో బుధుడు.. ఈ రాశుల వారికి కష్టనష్టాల నుంచి విముక్తి
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ టార్గెట్‌గా అభిజీత్‌ దిప్కే కీలక వ్యాఖ్యలు
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ టార్గెట్‌గా అభిజీత్‌ దిప్కే కీలక వ్యాఖ్యలు
ఇంటి గోడల్లో, నేల కింద, ఫర్నిచర్ లో డబ్బే డబ్బు.. మాఫియా ఇళ్లల్లో
ఇంటి గోడల్లో, నేల కింద, ఫర్నిచర్ లో డబ్బే డబ్బు.. మాఫియా ఇళ్లల్లో
ఖైరతాబాద్‌ బడా గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం
ఖైరతాబాద్‌ బడా గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం
మెగా హీరోను కాపాడిన అబ్దుల్ ఫ‌ర్హాన్‌ ఇప్పుడేం చేస్తున్నాడు?
మెగా హీరోను కాపాడిన అబ్దుల్ ఫ‌ర్హాన్‌ ఇప్పుడేం చేస్తున్నాడు?
అలసటను పోగొట్టే టాప్ 5 ఎనర్జీ బూస్టర్లు ఇవే
అలసటను పోగొట్టే టాప్ 5 ఎనర్జీ బూస్టర్లు ఇవే
వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు పేరు ఖరారు.. ఏంటంటే..?
వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు పేరు ఖరారు.. ఏంటంటే..?
స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
పెళ్లి తర్వాత మీ ఫోన్ నుంచి వీటిని తొలగించకుంటే ఇబ్బందులు తప్పవు!
పెళ్లి తర్వాత మీ ఫోన్ నుంచి వీటిని తొలగించకుంటే ఇబ్బందులు తప్పవు!