AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఈ సారి ఒకే క్లిక్‌తో క్షణాల్లోనే అకౌంట్లోకి నగదు.. ఈపీఎఫ్‌వో నుంచి మరో అప్డేట్.. ఖాతాదారులకు పండుగే..

గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ఓ ఇప్పటికే జమ చేసింది. ఈ సారి ఆటోమేటెడ్ విధానంలో సులభంగా,వేగంగా వడ్డీ జమ చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. వడ్డీ జమ అయిందా.. లేదా అనేది సలువుగా తెలుసుకోవచ్చు. ఎలా అంటే..

EPFO: ఈ సారి ఒకే క్లిక్‌తో క్షణాల్లోనే అకౌంట్లోకి నగదు.. ఈపీఎఫ్‌వో నుంచి మరో అప్డేట్.. ఖాతాదారులకు పండుగే..
Epfo Interest
Venkatrao Lella
|

Updated on: Sep 24, 2026 | 3:37 PM

Share

తమ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ తెలిపింది. 2025-26 ఆర్దిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వడ్డీని జమ చేసినట్లు స్పష్టం చేసింది. ఆటోమేటెడ్ వార్షిక వడ్డీ క్రెడిట్ ద్వారా 34 కోట్లకుపైగా ఖాతాదారుల అకౌంట్లలో రూ.1.44 లక్షల కోట్లకుపైగా వడ్డీని జమ చేసినట్లు తెలిపింది. 8.25 శాతం వడ్డీ రేటు ప్రకారం ఆటోమేటిక్‌గా లెక్కించి చెల్లింపులు జరిగాయంది. ఆటోమేటెడ్ విధానం వల్ల వేగంగా, సజావుగా, అవాంతరాలు లేకుండా క్రెడిట్ చేసినట్లు పేర్కొంది. సింగిల్ క్లిక్‌తో ఈ సారి వడ్డిని అందరి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా ఈపీఎఫ్‌ఓ తన ఎక్స్ ఖాతాలో దీని గురించి పోస్ట్ చేసింది.

గతంలో ఈపీఎఫ్ఓ వడ్డీ జమ చేయడానికి నెలల తరబడి సమయం పట్టేది. ఖాతాదారులకు అందాల్సిన వడ్డీని లెక్కించి క్రెడిట్ చేసేందుకు కొన్ని నెలల టైమ్ పట్టేది. అంతేకాకుండా సర్వర్ సమస్యలు, టెక్నికల్ ప్రాబ్లంలు ఉండేవి. కానీ ఈపీఎఫ్‌వో ఇటీవల కొత్త సంస్కరణలను తీసుకొచ్చింది. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మరింత మెరుగుపర్చింది. క్లెయిమ్స్ ప్రాసెస్, వడ్డీ జమలో ఆటోమేటెడ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా రూ.5 లక్షల్లోపు క్లెయిమ్స్‌ను మూడు రోజుల్లోనే క్లియర్ చేస్తోంది. గతంలో క్లెయిమ్స్ ప్రాసెస్ మాన్యువల్ వెరిఫికేషన్ ఉండేది. అధికారులు డాక్యుమెంట్స్, కేవైసీ వివరాలు పరిశీలించి ప్రాసెస్ చేసేవారు. కానీ ఇప్పుడు మాన్యువల్ జోక్యాన్ని తగ్గించి సిస్టమ్ ఆటోమేటిక్‌గా క్లెయిమ్ సెటిల్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని వల్ల క్లెయిమ్స్ వేగంగా జరుగుతున్నాయి.

పీఎఫ్ వడ్డీ జమ అయిందా.. లేదా? అనేది ఎలా తెలుసుకోవాలి..?

పీఎఫ్ వడ్డీ జమ అయిందా.. లేదా అనేది క్షణాల్లోనే తెలుసుకోవచ్చు. నాలుగు మార్గాల్లో దీనిని తెలుసుకోవచ్చు.

-9966044425 నెంబర్‌కు పీఎఫ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు

-ఇక EPFOHO UAN ENG లేదా EPFOHO UAN TEL అని టైప్ చేసి 7738299899కి ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు

– ఉమాంగ్ యాప్ ఓపెన్ చేసి ఈపీఎఫ్ఓ అని సెర్చ్ చేయాలి. అనంతరం వ్యూ పాస్ బుక్ ఆప్షన్ ఎంచుకుని యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ పాస్ బుక్ ఓపెన్ అవుతుంది

-ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా కూడా వడ్డీ జమ అయిందా.. లేదా అనేది తెలుసుకోవచ్చు. వెబ్ సైట్ తెరిచాక పాస్ బుక్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్ నమోదు చేయాలి. ఆ తర్వాత పాస్ బుక్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అందులో దిగువ భాగాన వడ్డీ ఎంట్రీ దగ్గర ఎంత వడ్డీ జమ అయిందనేది కనిపిస్తుంది.

Follow Us
ఒకే క్లిక్‌తో అకౌంట్లో నగదు జమ.. ఈపీఎఫ్ఓ బిగ్ అప్డేట్..
ఒకే క్లిక్‌తో అకౌంట్లో నగదు జమ.. ఈపీఎఫ్ఓ బిగ్ అప్డేట్..
అప్పుడే OTTలో రవితేజ తమ్ముడి కుమారుడి సినిమా.. IMDBలో 8.6 రేటింగ్
అప్పుడే OTTలో రవితేజ తమ్ముడి కుమారుడి సినిమా.. IMDBలో 8.6 రేటింగ్
మటన్‌ను ఇలా వండుతున్నారా? క్యాన్సర్ రిస్క్ తప్పదట!
మటన్‌ను ఇలా వండుతున్నారా? క్యాన్సర్ రిస్క్ తప్పదట!
రాత్రి భోజనం తర్వాత ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది!
రాత్రి భోజనం తర్వాత ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది!
10 అఫ్గాన్ ప్రాంతాలే టార్గెట్ గా .. పాకిస్థాన్ వైమానిక దాడులు
10 అఫ్గాన్ ప్రాంతాలే టార్గెట్ గా .. పాకిస్థాన్ వైమానిక దాడులు
చింత చెట్టు నుంచే కోరిన పండ్లు.. ఇదే సత్యసాయి కల్పవృక్షం
చింత చెట్టు నుంచే కోరిన పండ్లు.. ఇదే సత్యసాయి కల్పవృక్షం
జపాన్‌తోనే వణికిపోయారు.. మరి గోల్డ్ పట్టేదెలా..?
జపాన్‌తోనే వణికిపోయారు.. మరి గోల్డ్ పట్టేదెలా..?
దసరా, దీపావళికి ఇంటికెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు..
దసరా, దీపావళికి ఇంటికెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు..
కూరగాయలు లేనప్పుడు త్వరగా చేసునే పిల్లల లంచ్ బాక్స్ రిసిపీ ఇదే
కూరగాయలు లేనప్పుడు త్వరగా చేసునే పిల్లల లంచ్ బాక్స్ రిసిపీ ఇదే
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. నేటి నుంచే పరీక్షల 2027 ఫీజులు షురూ
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. నేటి నుంచే పరీక్షల 2027 ఫీజులు షురూ