AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఖాతాదారులకు అలర్ట్..

తమ ఖాతాదారులకు బ్యాంకులు సూచనలు జారీ చేశాయి. ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె చేపట్టనున్నారు. ఈ సమ్మె ప్రభావంతో బ్యాంక్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ క్రమంలో ఆన్ లైన్ సేవలను ఉపయోగించుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.

Bank Holidays: దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఖాతాదారులకు అలర్ట్..
Banks Holiday
Venkatrao Lella
|

Updated on: Sep 23, 2026 | 9:59 PM

Share

బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు మూడపడనున్నాయి. బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సెప్టెంబర్ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నాయి. వారానికి ఐదు రోజుల పని దినంతో పాటు ఉద్యోగుల నియామకం, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ ఇస్తూ ఈ నెల 11న ఉద్యోగ సంఘాలు సమ్మె చేపట్టాయి. అయితే వారి డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోవడంతో ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో బ్యాంక్ సేవల్లో తీవ్ర అంతరాయం కలగనుంది. కొన్ని బ్రాంచుల్లో కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశముందని తెలుస్తోంది.

సెప్టెంబర్ 22వ తేదీన కేంద్ర ప్రభుత్వంతో బ్యాంక్ ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపాయి. అయితే ఈ చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగించాలని నిర్ణయించాయి. అయితే ఈ సమ్మెకు ముందు సెప్టెంబర్ 26న నాలుగో శనివారం బ్యాంకులకు సాధారణ సెలవు కావడంతో మూతపడనున్నాయి. అయితే సెప్టెంబర్ 27 ఆదివారం కూడా బ్యాంకులకు సాధారణ సెలవు కాగా.. ఆ రోజు తెరిచి ఉంచాలని ఆర్ధికశాఖ ఆదేశించింది. దీంతో ఈ సారి ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయనున్నాయి. బ్యాంక్ వినియోగదారులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు సమ్మె క్రమంలో తమ కస్టమర్లకు బ్యాంకులు ఎస్‌ఎంఎస్ రూపంలో అలర్ట్ జారీ చేస్తున్నాయి.

బ్యాంక్ బ్రాంచ్‌లు మూతపడ్డా డిజిటల్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని బ్యాంకులు సూచిస్తున్నాయి. దీంతో డిజిటల్ సేవలను వినియోగదారులు ఉపయోగించుకోవాలని చెబుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఇప్పటకే తమ కస్టమర్లకు సూచనలు జారీ చేశాయి. నగదు అవసరం ఉన్న కస్టమర్లు ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేసుకోవాలని స్పష్టం చేశాయి. అయితే ఈ మూడు రోజుల సమ్మె తర్వాత కూడా తమ డిమాండ్ నెరవేర్చకపోతే అక్టోబర్ 26వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు బ్యాంకు యూనియన్లు హెచ్చరిస్తున్నాయి.

Follow Us