ఆదిలాబాద్ రిమ్స్ సందర్శనకు వెళ్లిన మంత్రి దామోదర రాజనరసింహ హెలికాప్టర్ ఇంధనం అయిపోవడంతో అక్కడే నిలిచిపోయింది. స్థానికంగా ఇంధనం లభ్యం కాకపోవడంతో, మంత్రి రాత్రికి రాత్రే కార్లో హైదరాబాద్‌కు బయలుదేరారు. మరుసటి రోజు మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ఇంధనం తెప్పించి హెలికాప్టర్‌ను తిరిగి పంపించారు. గాలిలో ఇంధనం అయిపోతే ప్రమాదమని, ప్రోటోకాల్ లోపంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.