తీవ్ర వాయుగుండం ప్రభావంతో తణుకులో భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ప్రధాన రహదారులు జలమయం కాగా, గుంతల్లో పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి సమయంలో ఒక మినీ వ్యాన్ బోల్తా పడింది. ఏలూరు జిల్లా కన్నాపురంలో కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.