తిరుపతి రూరల్‌లోని ఆవిలాల ఆంధ్ర గ్రామీణ బ్యాంకులో అప్రైజర్ నిర్లక్ష్యంతో 60 గ్రాముల బంగారం చోరీకి గురైంది. పగలంతా ప్రజలు ఉండగానే ఓ దొంగ పేపర్‌ను అడ్డంపెట్టుకొని బంగారాన్ని మాయం చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనం బయటపడగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.