AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic: టాక్సిక్ టీజర్ రివ్యూ.. హీరోయిన్లు లేరనుకున్నారా..? ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూస్తే అసలు కథ వేరే ఉంది..!

కన్నడ స్టార్‌ హీరో యశ్‌ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టాక్సిక్‌. ఇటీవల చిన్న గ్లింప్స్ తో సంచలనం సృష్టించిన ఈ మూవీ.. ఇప్పుడు టీజర్‌ వచ్చేసింది. తాజాగా విడులైన టీజర్‌లో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను చూపించారు మేకర్స్. ‘కేజీఎఫ్, కేజీఎఫ్‌ 2’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ తర్వాత యష్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం కావడంతో ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Toxic: టాక్సిక్ టీజర్ రివ్యూ.. హీరోయిన్లు లేరనుకున్నారా..? ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూస్తే అసలు కథ వేరే ఉంది..!
Toxic Teaser
Praveen Vadla
| Edited By: |

Updated on: Feb 20, 2026 | 7:51 PM

Share

రాకింగ్ స్టార్ యశ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ టీజర్ రానే వచ్చేసింది. 2 నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ ఆద్యంతం యాక్షన్ ఎలిమెంట్స్‌తో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అయితే ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా సాగిన ఈ విజువల్స్ చూసిన తర్వాత చాలా మంది అభిమానుల మదిలో మెదిలిన మొదటి ప్రశ్న.. ఇందులో హీరోయిన్లు ఎక్కడ?. కేవలం యాక్షన్, మాస్ ఎలివేషన్స్ మీదే ఫోకస్ చేయడంతో, టీజర్‌లో అసలు హీరోయిన్లే లేరని ఫ్యాన్స్ కాస్త ఫీల్ అవుతున్నారు. నిజానికి ‘టాక్సిక్’ సినిమాలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు క్రేజీ హీరోయిన్లు నటిస్తున్నారు. సెన్సేషనల్ బ్యూటీ రుక్మిణి వసంత్, బాలీవుడ్ భామలు కియారా అద్వానీ, తారా సుతారియా, లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు హ్యూమా ఖురేషీ లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..

ఇంతమంది స్టార్లు ఉన్నా టీజర్‌లో ఎవరికీ పెద్దగా స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదనేది పైకి కనిపిస్తున్న మాట. కానీ కళ్లు పక్కకు తిప్పకుండా టీజర్‌ని ఫ్రేమ్ టు ఫ్రేమ్ గమనిస్తే మాత్రం అసలు విషయం అర్థమవుతుంది. డైరెక్టర్ చాలా తెలివిగా ఒక్కో ఫ్రేమ్‌లో ఈ హీరోయిన్లందరినీ జస్ట్ అలా చూపించి వదిలేశారు. ఓ షాట్‌లో సమాధి దగ్గర నయనతార చాలా డీప్ లుక్‌లో కనిపిస్తుంది. అలాగే ఓ రొమాంటిక్ సీన్‌లో తారా సుతారియా మెరిసిందనేది నెటిజన్ల వాదన. ఇక యశ్ విపరీతంగా ఫైట్ చేస్తున్న సీక్వెన్స్‌లో వెనకాల రుక్మిణి వసంత్ కూడా కనిపించింది. మరో రొమాంటిక్ సీన్‌లో అచ్చం కియారా అద్వానీ లాగే ఉన్న ఓ హీరోయిన్ కూడా ఉంది. వీళ్లందరినీ అలా బ్లింక్ అండ్ మిస్ అన్నట్లు చూపించినా.. ఒక్క హ్యూమా ఖురేషీ మాత్రం ఈ 2 నిమిషాల టీజర్‌లో ఎక్కడా కనిపించలేదు.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

ఏదేమైనా ‘టాక్సిక్’ టీజర్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ పెంచేసింది. సినిమాపై అప్పటిదాకా ఉన్న అంచనాలను, ఈ యాక్షన్ కట్ అమాంతం డబుల్ చేసింది. యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, డార్క్ అండ్ రస్టిక్ విజువల్స్ సినిమాను వేరే లెవెల్‌కి తీసుకెళ్లేలా ఉన్నాయి. ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా మార్చి 19న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ టీజర్ క్రియేట్ చేసిన సెన్సేషన్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ యశ్ సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.500 కోట్ల వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని గట్టిగా టాక్ నడుస్తోంది. మొత్తానికి ‘టాక్సిక్’ రాకతో పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులు మరోసారి బద్దలవ్వడం గ్యారెంటీ.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

Follow Us