AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బస్సు కింద  మంటలు.. వీడియోల కోసం ఎగబడకుండా ప్రాణాలను కాపాడిన స్థానికులు

బస్సు కింద మంటలు.. వీడియోల కోసం ఎగబడకుండా ప్రాణాలను కాపాడిన స్థానికులు

Phani CH
|

Updated on: Feb 20, 2026 | 7:20 PM

Share

కేరళలోని ఒట్టప్పాలం బస్సు ప్రమాదంలో స్థానికులు చూపిన అద్భుత ధైర్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంటలు అంటుకున్న బస్సు నుంచి డెలివరీ బాయ్ శ్రీరాగ్, ఆటో డ్రైవర్లు, షాప్ యజమానులు 35 మంది ప్రయాణికులను చిన్న గాయం కూడా లేకుండా కాపాడారు. పెట్రోల్ బంకుకు మంటలు అంటుకోకుండా నిరోధించి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. వీడియోలు తీయకుండా మానవత్వం చాటుకున్న కేరళ ప్రజల సమయస్ఫూర్తిని "కేరళ మోడల్"గా ప్రశంసిస్తున్నారు.

కేరళలోని ఒట్టప్పాలం బస్సు ప్రమాదంలో స్థానికుల సహాయకచర్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ప్రమాదం జరిగినపుడు వీడియోల కోసం ఎగబడకుండా స్థానికులు చూపించిన ధైర్యాన్ని అందరూ కొనియాడుతున్నారు. ఈ ఘటన ముందు షాక్‌కి గురి చేసినా స్థానికుల తక్షణ సాయం వల్ల అంత పెద్ద అగ్నిప్రమాదంలో బస్సు ప్రయాణికుల్లో ఒక్కరికి కూడా చిన్న గాయం కాకుండా బయట పడ్డారు. అంతేకాదు బస్సు మంటలను పూర్తిగా ఆపివేసి, పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ కు మంటలు అంటుకోకుండా పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు. కేరళ రోడ్డు రవాణాకు చెందిన బస్సు 35 మంది ప్రయాణికులతో వెళ్తుండగా.. ఒట్టుపాలం వద్దకు రాగానే, బస్సు ముందుభాగంలో ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే పొగ బస్సు లోపల నిండిపోయింది. ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ కారణంగా ఆటోమేటిక్ డోర్ జామ్ అయింది. ప్రయాణికులు బయటకు రాలేక హాహాకారాలు చేసారు. అటుగా బైక్‌పై వెళ్తున్న డెలివరీ బాయ్‌ శ్రీరాగ్ పరిస్థితిని గమనించి వెంటనే స్పందించాడు. తన బైక్‌ను పక్కన పడేసి బస్సు వైపు పరుగెత్తి, జామ్ అయిన ముందు డోర్‌ను పగలగొట్టి తెరిచాడు. చుట్టుపక్కల ఉన్న ఆటో డ్రైవర్లు, షాప్ యజమానులు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అగ్నిమాపక సిలిండర్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వారంతా క్షణాల్లో స్పందించడంతో 35 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సీసీ టీవీ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తక్షణ సహాయంలో కేరళ ప్రజలు ముందు ఉంటారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రమాదం జరిగినపుడు చూస్తూ నిలబడటం, భయపడటం లేదా ఫోన్లో వీడియోలు తీయకుండా స్థానికులు మానవత్వం, ధైర్యం, సమయస్ఫూర్తి చూపించారని అంటున్నారు. అంతేకాదు “కేరళ మోడల్” అంటూ హ్యాట్సాఫ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహా కుంభమేళాను తలపించిన త్రిశూల చక్రతీర్థ స్నానం

Rajamouli: జక్కన్న నయా స్ట్రాటజీ.. వర్కవుట్‌ అవుతోందిగా

వేల్పారిలో ధనుష్‌.. శంకర్‌ ప్లాన్‌ బీ సిద్ధం చేశారా ??

Anupama Parameswaran: సొంత రికార్డును అనుపమ బ్రేక్‌ చేస్తారా

సంక్రాంతికి మాత్రమే ఆడియన్స్ వస్తారా..? పండగ తర్వాత కళ తప్పిన బాక్సాఫీస్

Follow Us