AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు నిర్మాత స్రవంతి రవికిషోర్. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. నిర్మాణ రంగంలో సక్సెస్ అయిన ఆయన.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీప్రయాణం, సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..
Sravanthi Ravi Kishore, Ven
Rajitha Chanti
|

Updated on: Feb 17, 2026 | 11:36 AM

Share

నిర్మాత స్రవంతి రవికిషోర్ ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో విభిన్న కంటెంట్ చిత్రాలను నిర్మించిన ఆయన.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే వెకంటేశ్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రం నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఫైట్లు, మాస్ అంశాలతో సినిమాలు రాజ్యమేలుతున్న తరుణంలో, వెంకటేష్ ఒక్క ఫైట్ కూడా లేని ఈ సినిమాకు అంగీకరించడం విశేషం అని పేర్కొన్నారు. నువ్వే కావాలి సినిమా విజయం, అలాగే భాస్కర్ (త్రివిక్రమ్) ప్రతిభను గుర్తించి ఈ కథకు ఆమోదం తెలిపారని రవికిషోర్ వివరించారు. హీరోగా వెంకటేష్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని, తనదైన కథల ఎంపిక ద్వారానే ఇంత మంది అభిమానులను పొందారని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

నువ్వు నాకు నచ్చావ్ చిత్రాన్ని చూసిన ఒక వ్యక్తి దీనిని మరో గుండమ్మ కథ అని పోల్చారని రవికిషోర్ ప్రస్తావించారు. అప్పట్లో వెంకటేష్ సతీమణి కూడా త్రివిక్రమ్ తో మాట్లాడుతూ, ఈ సినిమా రాబోయే 15-20 ఏళ్ల పాటు గుర్తుంచుకునే సినిమా అవుతుందని చెప్పారని రవికిషోర్ గుర్తు చేసుకున్నారు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలు చేసే సమయంలో అవి ఎంత పెద్ద విజయాలు సాధిస్తాయో ఊహించలేదని, అవి ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు. విజయవంతమైన చిత్రాలతో పాటు జనం ఆదరించని సినిమాలు కూడా ఉన్నాయని, వాటిని కూడా తాము సమానంగా ప్రేమిస్తామని, ఎందుకంటే వాటిని కూడా అంతే కష్టపడి, ఇష్టపడి నిర్మించామని రవికిషోర్ స్పష్టం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

నువ్వు నాకు నచ్చావ్ స్క్రిప్ట్ పట్ల తాను ఎంతగానో ప్రేమ పెంచుకున్నానని, షూటింగ్ కు వెళ్ళే ముందు ఆ స్క్రిప్ట్ ఫైల్ ను కోట్ల రూపాయల విలువైనదిగా భావించి గర్వంగా తిరిగేవాడినని రవికిషోర్ చెప్పారు. స్క్రిప్ట్ ను కంఠతః వచ్చే వరకు చదువుకొని, రాత్రులు షాపులో పడుకొని కూడా పక్కనే పెట్టుకుని చదివేవారట. నాయుడు గారు కూడా స్క్రిప్ట్ పట్ల తన అంకితభావాన్ని మెచ్చుకునే వారని గుర్తు చేసుకున్నారు. సినిమా అందానికి ప్రధాన కారణం ఆర్తి అగర్వాల్ అని రవికిషోర్ పేర్కొన్నారు. ముఖ్యంగా వెంకటేష్ ఆమెను మొదటిసారి మెట్లపై చూసిన సన్నివేశం, దాని వెనుక ఉన్న దర్శకుడు భాస్కర్ విజన్ ను వివరించారు. ఆ షాట్ కోసం భాస్కర్ చాలా కష్టపడ్డారని, చివరికి రామానాయుడు స్టూడియోస్ లోని రాంచంద్రాపురం సెట్ లోని మెట్లు ఆయనకు నచ్చాయని చెప్పారు. హీరోయిన్ ఎంపిక ప్రక్రియలో భాస్కర్ కొత్త అమ్మాయి కావాలని పట్టుబట్టారని, స్టార్ డమ్ కనపడకుండా పాత్ర మాత్రమే కనిపించాలని కోరుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ముంబైలో మోడలింగ్ ఏజెన్సీలలో ఆర్తి అగర్వాల్ ఫోటోను చూసి భాస్కర్ ఆమెనే నందినిగా ఎంపిక చేశారని వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

Follow Us