AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

సాధారణంగా సినీరంగంలో స్టార్ హీరోల వారసులు తక్కువ సమయంలోనే సెటిల్ అవుతుంటారు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంటారు. కానీ ఓ సూపర్ స్టార్హీరో తనయుడు మాత్రం అవకాశాల కోసం ప్రతి ప్రొడక్షన్ హౌస్ చుట్టూ తిరిగాడు. అతడికి నాలుగు సంవత్సరాలపాటు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. కానీ 54 ఏళ్ల వయసులో వచ్చిన ఒక్క ఛాన్స్ తో ఇండస్ట్రీనే షేక్ చేశాడు.

Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..
Bobby Deol
Rajitha Chanti
|

Updated on: Feb 05, 2026 | 8:42 AM

Share

తండ్రి సూపర్ స్టార్.. అన్నయ్య టాప్ హీరో.. అయినప్పటికీ అతడు అవకాశాల కోసం ప్రతి నిర్మాత ఆఫీస్ చుట్టూ తిరిగాడు. ఛాన్స్ కోసం నాలుగేళ్లు ఎదురుచూశాడు. కొన్నేళ్లపాటు తన భార్య సంపాదన మీదనే బతికాడు. తన కొడుకులు సైతం తనను సందేహాంగా చూసే పరిస్థితికి చేరుకున్నాడు. కానీ ఒక్క సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కష్టాల్లో తనకు అతడి భార్య మాత్రమే అండగా ఉందని ఇటీవల పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. నువ్వు ఎందుకు నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకుంటావు? అంటూ ప్రతిసారి తన భార్య అండగా ఉండేదని.. పార్టీలకు, బంధువుల వేడుకలకు సైతం దూరంగా ఉండేవాడినని.. ఎవరూ తనను ఇష్టపడినట్లు అనిపించేది కాదని చెప్పుకొచ్చాడు. స్టార్ కుటుంబానికి చెందినప్పటికీ సినీరంగంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ ఒక్క విలన్ పాత్ర అతడి జీవితాన్ని మార్చేసింది. ఒక్క మూవీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడే బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్.

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..

బాబీ డియోల్ దివంగత బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్ర కుమారుడు. 1995లో థియేటర్లలో విడుదలైన ‘పర్సాద్’ అనే హిందీ చిత్రం ద్వారా నటుడిగా అరంగేట్రం చేశాడు. ధర్మేంద్ర కొడుకుగా సినీరంగంలో అడుగుపెట్టినప్పటికీ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి సోదరుడు సన్నీ డియోల్ మాత్రం సూపర్ స్టార్ అయ్యాడు. పర్సద్ తర్వాత గుప్త్, సోల్జర్ వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు. సంవత్సరానికి 3 చిత్రాల్లో నటించిన బాబీ డియోల్.. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో చాలా కాలం పాటు ఇంట్లోనే ఉండిపోయాడు. 2013 నుంచి 2017 వరకు ఏ సినిమాలోనూ నటించలేదు. 2018 సల్మాన్ ఖాన్ నటించిన ‘రేస్ 3’ చిత్రంలో బాబీ డియోల్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ బాబీ డియోల్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా అతడి కెరీర్ మలుపు తిప్పింది. ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ అబ్రార్ హాక్ పాత్రతో ఒక్కసారిగా అతడు పాపులర్ అయ్యాడు. ఇందులో ఒక్క డైలాగ్ లేకపోయినా కేవలం తన యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్, మేనరిజంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. యానిమల్ సినిమా తర్వాత తెలుగు, హిందీ భాషలలో అతడికి అవకాశాలు క్యూ కట్టాయి. 54 ఏళ్ల వయసులో సినీరంగంలో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

View this post on Instagram

A post shared by Bobby Deol (@iambobbydeol)

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఇప్పుడు
సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఇప్పుడు
పాకిస్తాన్ అని ఆ దేశానికి పేరు పెట్టింది ఎవరో తెలుసా..?
పాకిస్తాన్ అని ఆ దేశానికి పేరు పెట్టింది ఎవరో తెలుసా..?
కేదార్‌నాథ్‌‌లో పాత కాలిబాట మార్గం ఓపెన్‌.. 13 ఏళ్ల తర్వాత మళ్ళీ.
కేదార్‌నాథ్‌‌లో పాత కాలిబాట మార్గం ఓపెన్‌.. 13 ఏళ్ల తర్వాత మళ్ళీ.
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు టీమిండియా ప్లేయర్లు..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు టీమిండియా ప్లేయర్లు..
తిరుమల వచ్చే భక్తులకు ఇక నో టెన్షన్.. టీటీడీ కీలక డెసిషన్
తిరుమల వచ్చే భక్తులకు ఇక నో టెన్షన్.. టీటీడీ కీలక డెసిషన్
మొటిమలు, మచ్చలతో విసిగిపోయారా..? ఈ నీటిని 20 రోజులు తాగితే చాలు!
మొటిమలు, మచ్చలతో విసిగిపోయారా..? ఈ నీటిని 20 రోజులు తాగితే చాలు!
ప్రియుడితో నవ వధువు పరార్‌.. భర్త, పెళ్లి పెద్ద ఆత్మహత్య!
ప్రియుడితో నవ వధువు పరార్‌.. భర్త, పెళ్లి పెద్ద ఆత్మహత్య!
రూ.21 కోట్లు పెడితే రూ.13 కోట్ల కలెక్షన్స్.. అట్టర్ ప్లాప్ మూవీ..
రూ.21 కోట్లు పెడితే రూ.13 కోట్ల కలెక్షన్స్.. అట్టర్ ప్లాప్ మూవీ..
చికెన్ ధరలు ఢమాల్.. ఒకేసారి తగ్గిన ధరలు.. కేజీ ఎంతో తెలుసా..?
చికెన్ ధరలు ఢమాల్.. ఒకేసారి తగ్గిన ధరలు.. కేజీ ఎంతో తెలుసా..?
కాంగ్రెస్ Vs జనసేన.. పవన్ కల్యాణ్ తెలంగాణ టూర్‌తో పెరిగిన..
కాంగ్రెస్ Vs జనసేన.. పవన్ కల్యాణ్ తెలంగాణ టూర్‌తో పెరిగిన..