AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి విషయం వైరలవుతుంది. ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైన నెట్టింట ఇట్టే చక్కర్లు కొడుతుంది. అందుకే సినీతారలు ఈవెంట్స్, పార్టీలలో ఎంతో జాగ్రత్తగా వ్యహరించాలి. ఇదివరకు చాలా మంది తారలు మాట్లాడిన మాటలపై నెటిజన్స్ మండిపడ్డారు. తాజాగా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ సైతం మరోసారి నెట్టింట విమర్శలకు గురయ్యాడు.

JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.
Chandrahas, Jd Chakravarthy
Rajitha Chanti
|

Updated on: Feb 04, 2026 | 12:45 PM

Share

బుల్లితెరపై నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాకర్. సీరియల్స్, షోల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పటికీ సీరియల్స్ ద్వారా అలరిస్తున్నారు. మరోవైపు ప్రభాకర్ కూతురు, కొడుకు సైతం సినీరంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు చంద్రహాస్ హీరోగా తెరంగేట్రం చేశాడు. తొలి చిత్రంతోనే నెట్టింట భారీ ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. తన ఫస్ట్ మూవీ ఈవెంట్లో ఆయన పలికించిన హావభావాలు చూసి యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చేశారు. ఇప్పుడు మరో సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు చంద్రహాస్. బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈనెల 6న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో జరిగిన వేడుకలో చంద్రహాస్ స్టేజీపై పాడిన పాట ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపింది.

ఎక్కువ మంది చదివినవి: Jabardasth: పెద్ద హీరో సినిమాలో ఛాన్స్.. మొహం మీదే వద్దని చెప్పా.. జబర్దస్త్ బ్యూటీ..

కుటుంబ సభ్యులు, మహిళలు, సినీప్రముఖులు హాజరైన సభలో బూతు పాటను పాడాడు. దీంతో అతడి తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. అందరి ముందు అలాంటి పాడ పాడడం ఏంటనీ సీరియస్ అవుతున్నారు. దీంతో అతడి తీరుపై నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ఈ ఈవెంట్ లో ఉన్న జేడీ చక్రవర్తి తాజాగా ఆ ఘటనపై స్పందించారు. చంద్రహాస్ పాడుతున్నప్పుడు తాను కూడా షాక్ లో ఉన్నానని.. అసలు అతడు ఏం పాడుతున్నాడో తనకు అర్థం కాలేదని అన్నారు. కానీ ఆ పాటను తాను ఎంజాయ్ చేసినట్లు వీడియో ఎడిట్ చేసి నన్ను ట్రోల్ చేస్తున్నారని అన్నారు. ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుందని.. ఇలాంటి వేడుకలలో గెస్టులు మాట్లాడేది వినరు.. పక్కనున్న వారితో మాట్లాడటం.. తెలిసినవారిని పలకరిస్తూ ఉండిపోతారు. నా పక్కన అమ్మాయికి తెలుగు అర్థం కాక చప్పుట్లు కొట్టింది. అది చూసి నేను చప్పట్లు కొట్టానని అంటున్నారు. నేను బూతులు మాట్లాడను.. ఎవరైనా మాట్లాడిన సహించను అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి: Uday Kiran : ఆ చెత్త సినిమాలే నా కెరీర్‏ను నాశనం చేశాయి.. ఉదయ్ కిరణ్ ఎమోషనల్ కామెంట్స్..

అతడు బూతులు పాడుతున్నాడని చెప్పడంతో ఆమె షాకైంది. చంద్రహాస్ పాడుతుంటే జయంత్, నేను ఒకరి మొహాలు ఒకరం చూసుకుని షాకయ్యం. అప్పుడే అక్కడి నుంచి లేచి వెళ్లిపోదామనుకున్నా..కానీ పూజా హేడీ పక్కకు తీసుకెళ్లి అలా చేయొద్దని చెప్పింది. నేను వెళ్లిపోతే సినిమాపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. కానీ చంద్రహాస్ అలా చేయడాన్ని నేను సమర్థించను.. చెత్త ప్రమోషన్లతో సినిమాలు ఆడతాయనుకుంటే వాళ్ల భ్రమే అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి: Dhandoraa Movie : దండోరా సినిమాలో బింధు మాధవి పాత్రలో ఆ హీరోయిన్ నటించాల్సింది.. కానీ.. డైరెక్టర్

ఎక్కువ మంది చదివినవి: Cinema : అర్థరాత్రి హోటల్లో అరుపులు.. 24 ఏళ్లుగా ఆ హీ‏రోయిన్‏ను భయపెడుతున్న సినిమా.. ఇప్పటికీ..

Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం