Jabardasth: పెద్ద హీరో సినిమాలో ఛాన్స్.. మొహం మీదే వద్దని చెప్పా.. జబర్దస్త్ బ్యూటీ..
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. మరికొందరు ఇప్పటికీ బుల్లితెరపై పలు రియాల్టీ షోలు చేస్తూ అలరిస్తున్నారు. తాజాగా ఓ అమ్మడు తనకు వచ్చిన సినిమా అవకాశాలను ఎందుకు రిజెక్ట్ చేసిందో వెల్లడించింది.

జబర్దస్త్ వర్ష ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, వ్యక్తిగత అనుభవాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరంగా వెల్లడించారు. మెయిన్ లీడ్స్‌గా, అలాగే పలు ప్రముఖ చిత్రాలలో స్పెషల్ సాంగ్స్‌గా వచ్చిన అవకాశాలను తాను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో వివరించారు. జబర్దస్త్ డేట్స్, టీవీ షెడ్యూల్స్ ముందే ఖరారు అవ్వడం వల్ల సినిమా డేట్స్‌తో సర్దుబాటు కావడం కష్టమని వర్ష పేర్కొన్నారు. ప్రస్తుతం టీవీలో లభిస్తున్న గుర్తింపు, ఆనందం తనకు ముఖ్యమని, ఇక్కడ తనను తాను డిస్టర్బ్ చేసుకోవడం ఇష్టం లేదని ఆమె తెలిపారు. కొన్ని రోజులు టీవీలో కొనసాగిన తర్వాత సినిమాల గురించి ఆలోచిద్దామని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..
తన కెరీర్‌లో ఎదురైన ఓ తీవ్రమైన ఆరోగ్య సమస్యను వర్ష ఈ సందర్భంగా పంచుకున్నారు. సంక్రాంతి ఈవెంట్ షూటింగ్ సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో పని చేయడం వల్ల అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. వాంతులు, ఇతర సమస్యలతో తాను స్పృహ కోల్పోయే స్థితికి చేరుకున్నానని చెప్పారు. వెంటనే మల్లెమాల వారు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రి నుంచి తిరిగొచ్చిన వెంటనే, అదే సెట్‌లో పూర్ణ అనే మరో నటి ఆరోగ్యం బాగాలేక సొమ్మసిల్లి పడిపోయినప్పుడు, ఆమె చేయాల్సిన “నా స్వామి” పాటకు తను డ్యాన్స్ చేశానని వర్ష వివరించారు. అప్పటికప్పుడు కేవలం పది నిమిషాలు ప్రాక్టీస్ చేసి, అందుబాటులో ఉన్న కాస్ట్యూమ్‌తో ఆ సాంగ్ పూర్తి చేసినట్లు ఆమె అంకితభావంతో కూడిన ఈ సంఘటనను గుర్తు చేసుకున్నారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..
సినిమాల్లో తాను ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారో కూడా వర్ష స్పష్టం చేశారు. మెయిన్ లీడ్స్ లేదా హీరోయిన్ పాత్రలు చేయాలని తనకు అస్సలు ఇష్టం లేదని అన్నారు. ఇంట్లో ఫ్యామిలీలో ఉండే వదిన, అక్క, చెల్లి వంటి పాత్రలంటే తనకు ఎక్కువ ఆసక్తి అని తెలిపారు. మేనేజర్లు ప్రధాన పాత్రల గురించి చెప్పినా, తనకు అలాంటి క్యారెక్టర్లే సంతోషాన్నిస్తాయని చెప్పారు. ప్రముఖ హీరోలతో కలిసి నటించాలని తన డ్రీమ్ రోల్స్ గురించి మాట్లాడుతూ, ఎన్టీఆర్ జూనియర్‌తో చెల్లెలి పాత్ర, రామ్ చరణ్‌తో ఓ పాత్ర, అల్లు అర్జున్‌తో గర్ల్‌ఫ్రెండ్‌గా నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే నాగచైతన్యతో ఒక మంచి లవ్ స్టోరీలో భాగం కావాలని ఉందని తన ఆశను పంచుకున్నారు. తన కలలు నిజం కావాలంటే, తాను చేయాలనుకున్న పాత్రలకు హీరోలు ఒప్పుకోవాలని వర్ష చిరునవ్వుతో పేర్కొన్నారు.
ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..
View this post on Instagram
ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..
