Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..
ప్రస్తుతం చాలా పాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే సంవత్సరాల క్రితం విడుదలైన పాటలు సైతం ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. అయితే దాదాపు 6 నెలల క్రితం రిలీజ్ అయిన ఒక పాట మాత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. ఇంతకీ ఆ సాంగ్ గురించి తెలుసుకుందామా.

ప్రస్తుతం యూట్యూబ్ లో ఓ సాంగ్ తెగ ట్రెండ్ అవుతుంది. ఆ పాట వైబ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదేనండి.. కూలీ సినిమాలోని మోనికా పాట యూట్యూబ్ లో దూసుకుపోతుంది. దాదాపు 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్, నాగార్జున, సత్యరాజ్, శృతి హాసన్ తదితరులు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ కాదా.. మోనికా పాట మాత్రం తెగ వైరల్ గా మారింది. ఈ పాటలో నటి పూజా హెగ్డే నటించగా.. ఈ పాటలో సౌబిన్ సాహిర్ డ్యాన్స్ వేరేలెవల్.
ఎక్కువమంది చదివినవి : Actress Rohini: రఘువరన్తో విడిపోవడానికి కారణం అదే.. ఆయన ఎలా చనిపోయాడంటే.. నటి రోహిణి..
అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ పాట యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుంది. ఈ పాటను సుబలక్ష్మి, అనిరుధ్ రవిచంద్రన్ పాడారు. ఇప్పటికీ ఈ సాంగ్ తెగ దూసుకుపోతుంది. ఇందులో పూజా హెగ్డే గ్లామరస్ లుక్స్, డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంది.
ఎక్కువమంది చదివినవి : Ramya Krishna : నా భర్తకు దూరంగా ఉండటానికి కారణం అదే.. హీరోయిన్ రమ్యకృష్ణ..
ప్రస్తుతం పూజా హెగ్డే సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. చాలా కాలంగా ఆమె నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి. ఇటీవల సూర్య జోడిగా రెట్రో చిత్రంలో నటించింది. ప్రస్తుతం విజయ్ దళపతి నటించిన జన నాయగన్ చిత్రంలో నటిస్తుంది. అయితే ఈ మూవీ విడుదల విషయంలో వివాదం నెలకున్న సంగతి తెలిసిందే.
ఎక్కువమంది చదివినవి : Tollywood: ఏంటండీ మేడమ్.. అందంతో చంపేస్తున్నారు.. నెట్టింట సీరియల్ బ్యూటీ అరాచకం.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..
ఎక్కువమంది చదివినవి : Tollywood : అప్పుడు రామ్ చరణ్ క్లాస్మెట్.. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్.. ఏకంగా చిరుతో భారీ బడ్జెట్ మూవీ..
