AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అప్పుడు రామ్ చరణ్ క్లాస్‏మెట్.. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్.. ఏకంగా చిరుతో భారీ బడ్జెట్ మూవీ..

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Tollywood : అప్పుడు రామ్ చరణ్ క్లాస్‏మెట్.. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్.. ఏకంగా చిరుతో భారీ బడ్జెట్ మూవీ..
Ram Charan
Rajitha Chanti
|

Updated on: Jan 29, 2026 | 5:12 PM

Share

బింబిసార వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మల్లిడి వశిష్ఠ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రమైన విశ్వంభర సినిమాకు ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వశిష్ఠ మాట్లాడుతూ ఈ మెగా ప్రాజెక్ట్ గురించి తన అనుభవాలను పంచుకున్నారు. చిరంజీవితో సినిమా చేయాలనేది చాలా మంది యువ దర్శకుల కల అని, అది తనకు అక్షరాలా నిజమైందని వశిష్ఠ తెలిపారు. బింబిసార తర్వాత, UV క్రియేషన్స్ విక్రమ్ ద్వారా చిరంజీవిని కలిసే అవకాశం లభించిందని, ఆపై రామ్ చరణ్ ప్రోత్సాహంతో చిరంజీవికి కథ చెప్పానని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్ అనుకోకుండానే సాధ్యమైందని, ఇది ఒక మిరాకిల్ అని వశిష్ఠ చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..

కథ చెప్పేటప్పుడు చిరంజీవి తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని, ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా కథ చెప్పమని ప్రోత్సహించారని ఆయన గుర్తు చేసుకున్నారు. “చిరంజీవి గారు మొదటిసారి కలిసినప్పుడు, కథ చెప్పడానికి వచ్చావు. నువ్వు చిరంజీవికి కథ చెప్తున్నావని మర్చిపో. నువ్వు హిట్‌ సినిమా తీసిన దర్శకుడివని మర్చిపో. ఒక ఆడియన్ గా, ఒక ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్ కి ఎలా కథ చెప్తావో అలా చెప్పు. నాకు అనిపించింది నేను చెప్తాను. నచ్చితే, ఇంప్లిమెంట్ చెయ్. లేదంటే ఎందుకు నచ్చలేదో నాకు చెప్పేయ్. కాల్ నీదే లాస్ట్‌లో అని చెప్పారు” అని వశిష్ఠ వెల్లడించారు. దీనివల్ల ఆయనతో సులభంగా మాట్లాడనని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..

చిరంజీవితో వశిష్ఠకు చిన్నతనం నుంచే పరిచయం ఉందని తెలిపారు. రామ్ చరణ్, అల్లు శిరీష్, రానా వంటి వారితో తాను బ్యాచ్ మేట్ నని, చిన్నప్పుడు చిరంజీవి ఇంటికి వెళ్లేవాడినని తెలిపారు. శంకర్ దాదా MBBS చిత్రానికి అప్రెంటీస్ గా కూడా పనిచేశానని పేర్కొన్నారు. విశ్వంభర చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయని, ఇది కేవలం ఒక ఫాంటసీ చిత్రమే తప్ప జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ కాదని వశిష్ఠ స్పష్టం చేశారు. ఈ విషయంలో అశ్వనీ దత్ నుండి వచ్చిన నోటీసు గురించి ప్రస్తావించగా, అది మీడియాలో వచ్చిన ఊహాగానాల వల్ల జరిగిందని, తన చిత్రానికి దానితో సంబంధం లేదని వశిష్ఠ అన్నారు. గతంలో ముల్లోక వీరుడు వంటి టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినా, తాను వాటి గురించి ఆలోచించలేదని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..

ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..

Follow Us
రాబోయే 3 నెలల్లో వీరి జీవితం టర్న్.. అపార ధనలాభం, భోగభాగ్యాలు!
రాబోయే 3 నెలల్లో వీరి జీవితం టర్న్.. అపార ధనలాభం, భోగభాగ్యాలు!
మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు
మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు
మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!
మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!
పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
ఏపీలో ఇకపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు.. ప్రభుత్వ నిర్ణయం..
ఏపీలో ఇకపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు.. ప్రభుత్వ నిర్ణయం..
ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం వీడలేదు.. భార్యపై అనుమానంతో..
ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం వీడలేదు.. భార్యపై అనుమానంతో..
ఈ అవయవాలు దెబ్బతింటే బాగుచేయడం దేవుడి వల్ల కూడా కాదట!
ఈ అవయవాలు దెబ్బతింటే బాగుచేయడం దేవుడి వల్ల కూడా కాదట!
సంపూర్ణేష్‌కు అంత తక్కువా..!!
సంపూర్ణేష్‌కు అంత తక్కువా..!!
గురువారం ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి వీరివైపు కన్నెత్తి కూడా చూడదు
గురువారం ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి వీరివైపు కన్నెత్తి కూడా చూడదు
వినాయకుడికి 11 వ రోజు సేమియా కేసరి నైవేద్యంగా పెట్టండి..
వినాయకుడికి 11 వ రోజు సేమియా కేసరి నైవేద్యంగా పెట్టండి..