AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : అర్థరాత్రి హోటల్లో అరుపులు.. 24 ఏళ్లుగా ఆ హీ‏రోయిన్‏ను భయపెడుతున్న సినిమా.. ఇప్పటికీ..

హారర్ సినిమాలకు భారతీయ సినీపరిశ్రమలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. క్షణక్షణం సస్పెన్స్, ఆద్యంతం కట్టిపడేసే సీన్స్.. వెన్నులో వణుకుపుట్టించే విజువల్స్ ఉన్నప్పటికీ హారర్ చిత్రాలను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇదిలా ఉంటే.. దెయ్యం సినిమాలను చిత్రీకరించే సమయంలో చిత్రయూనిట్ కు విచిత్రమైన సంఘటనలు ఎదురయ్యాయని వింటుంటాం. అలాంటి ఒక ఘటన గురించి తెలుసుకుందాం.

Cinema : అర్థరాత్రి హోటల్లో అరుపులు.. 24 ఏళ్లుగా ఆ హీ‏రోయిన్‏ను భయపెడుతున్న సినిమా.. ఇప్పటికీ..
Raaz Movie
Rajitha Chanti
|

Updated on: Feb 02, 2026 | 7:26 AM

Share

సరిగ్గా 24 ఏళ్ల క్రితం.. 2002 ఫిబ్రవరి 1న భారతీయ సినిమా ప్రపంచంలో విడుదలైన ఓ మూవీ ఊహించని విజయం సాధించింది. స్టార్ హీరోహీరోయిన్స్ లేరు.. బడ్జెట్ పెద్దది కాదు.. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఆ సినిమా పేరు రాజ్. దాదాపు 2 గంటల 32 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో బిపాసా బసు, డినో మోరియా, మాలిని శర్మ, అశుతోష్ రాణా, విశ్వజీత్ ప్రధాన పాత్రలు పోషించగా.. విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బిపాసాను రాత్రికి రాత్రే హారర్ క్వీన్ గా మార్చేసింది. ఇందులో భయానక సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులకు వణుకు పుట్టించాయి. అంతేకాదు.. వెండితెరపై సినీప్రియులను మాత్రమే కాకుండా నిజ జీవితంలో చిత్రయూనిట్ సభ్యులను సైతం ఈ మూవీ భయపెట్టింది.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..

ఈ సినిమాను ఊటీలోని ఫెర్న్‌హిల్ హోటల్, పైన్ ఫారెస్ట్, లారెన్స్ స్కూల్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రీకరణ సమయంలో జరిగిన వింత సంఘటనల గురించి బిపాషా బసు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. చిత్రయూనిట్ మొత్తం ఊటీలోని ఫెర్న్‌హిల్ హోటల్ నిద్రిస్తున్న సమయంలో అర్దరాత్రి పై అంతస్తు నుంచి ఫర్నిచర్ లాగడం, డ్యా్న్స్ చేయడం, అరుపులు వినిపించాయట. రాత్రంతా ఎవరూ నిద్రపోలేదట. ఉదయాన్నే హోటల్ మేనేజర్ కి ఫిర్యాదు చేయగా.. పైన అసలు ఎలాంటి అంతస్తు, రూమ్ లేదని చెప్పడంతో అందరూ షాకయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ హోటల్ మూతపడింది. ఇప్పటికీ ఆ హోటల్ క్లోజ్ అయ్యి ఉండగా.. పూర్తిగా శిథిలావస్థలోకి చేరింది. అలాగే ఈసినిమా షూటింగ్ సమయంలో పలుమార్లు విచిత్ర ఘటనలు ఎదురయ్యాయని బిపాసా పంచుకుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..

2002లో విడుదలైన ఈ మూవీ అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండవ సినిమాగా నిలిచింది. ఈ చిత్రం 48వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా నామినేట్ చేయబడింది. కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 37 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటికీ ఈ సినిమా ట్రెండింగ్ అవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..