AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhandoraa Movie : దండోరా సినిమాలో బింధు మాధవి పాత్రలో ఆ హీరోయిన్ నటించాల్సింది.. కానీ.. డైరెక్టర్

ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిన్న సినిమా దండోరా. ప్రేమ, కులం అనే అంశాలను ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఓటీటీలో దూసుకుపోతుంది. ఇందులో వేశ్య పాత్రలో బిందు మాధవి నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. తాజాగా ఈ రోల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు డైరెక్టర్ మురళి దేవసోత్.

Dhandoraa Movie : దండోరా సినిమాలో బింధు మాధవి పాత్రలో ఆ హీరోయిన్ నటించాల్సింది.. కానీ.. డైరెక్టర్
Bindhu Madhavi
Rajitha Chanti
|

Updated on: Feb 02, 2026 | 9:30 AM

Share

కథ బాగుంటే చిన్న సినిమా సైతం సూపర్ హిట్ కావాల్సిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి జాబితాలోకి చేరింది ఇటీవల విడుదలైన దండోరా చిత్రం.దర్శకుడు మురళీ కాంత్ రూపొందించిన ఈ సినిమాలో శివాజీ, బింధు మాధవి, నందు, నవదీప్ కీలకపాత్రలు పోషించారు. డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు డైరెక్టర్ మురళి దేవసోత్.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..

దండోరాలో నిత్యా మీనన్ పాత్రకు సంబంధించి దర్శకుడు మురళి దేవసోత్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దండోరాలో బిందు మాధవి పోషించిన పాత్ర కోసం మొదట నిత్యా మీనన్‌ను సంప్రదించినట్లు మురళి దేవసోత్ తెలిపారు. జూమ్ కాల్ ద్వారా కథను వివరించగా, నిత్యా మీనన్ కథ, పాత్రను చాలా మెచ్చుకున్నారు. తెలుగు సినిమాలో ఇలాంటి పాత్రలు రావడం అద్భుతమని ఆమె ప్రశంసించారు. పాత్రను ఎలా చూపిస్తారో తెలుసుకోవడానికి ఆమె ఐదు రిఫరెన్స్ చిత్రాలను కూడా అడిగారు. అయితే, డేట్స్ కుదరకపోవడం వల్ల నిత్యా మీనన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. అయినప్పటికీ, నిత్యా మీనన్ వంటి నటి ఈ పాత్రను అంగీకరించడం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని మురళి దేవసోత్ అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..

బిందు మాధవికి పాత్ర తీరును వివరించడానికి, స్లీజ్ లేకుండా కేవలం పాత్ర జీవనశైలిని చూపించడానికి రిఫరెన్స్ చిత్రాలను ఉపయోగించినట్లు దర్శకుడు తెలిపారు. ఆమె కూడా తనపై నమ్మకముంచి, ఈ పాత్రకు అంగీకరించారని తెలిపారు. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా తన ప్రయాణాన్ని విడిచిపెట్టి, మురళి దేవసోత్ దర్శకత్వ రంగంలోకి అడుగుపెట్టారు. దండోరా సినిమాకు వచ్చిన అద్భుతమైన స్పందన ఆయన ప్రయాణానికి గుర్తింపునిచ్చింది. సినిమా టీజర్ విడుదలైనప్పుడు అల్లు అర్జున్ నుంచి ప్రశంసలు అందుకున్నట్లు, అలాగే సినిమా విడుదలైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మురళి వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..