AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

ప్రస్తుతం యూట్యూబ్ లో ఎక్కడ చూసిన ఫోక్ సాంగ్స్ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా "రాతిరి రాతిరి" పాట యూట్యూబ్‌లో 13 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుని అద్భుత విజయాన్ని సాధించింది. ఈ పాట జానపద సంగీతానికి కొత్త ఊపిరి పోసింది. అయితే ఈ పాట గాయకులు నరసింహులు, ఉష ఓ ఇంటర్వ్యూలో ఈ పాట అనూహ్య విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. సంతోష్, ప్రశాంత్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ పాటను రాసి, స్వరపరిచి, నిర్మించారని, రాత్రి వేళల్లో మూడు రోజులపాటు షూటింగ్ జరిగిందని గాయకులు వివరించారు.

Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..
Folk Singer
Rajitha Chanti
|

Updated on: Feb 18, 2026 | 11:19 AM

Share

ప్రస్తుతం యూట్యూబ్ లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా గత పది రోజులుగా ఒక పాట దుమ్మురేపుతుంది. అదే “రాతిరి రాతిరి రాతిరిలో”. ఈ పాట యూట్యూబ్‌లో కేవలం పది రోజుల్లోనే 13 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుని సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ సాంగ్ సింగర్స్ నరసింహులు, ఉష ఈ పాట విజయం, దాని వెనుక ఉన్న కథను వివరించారు. నరసింహులు, ఉషలు పాడిన “చీమ దసరా”, “గట్టుకు గన్నెరాకు”, “నువ్వు ఏడున్నావే గంగి” పాటలు విజయం సాధించాయి. అయితే “రాతిరి రాతిరి” పాట ఇంత పెద్ద విజయం సాధిస్తుందని తాము ఊహించలేదని గాయకులు తెలిపారు. ఈ పాటకు రెండుసార్లు వాయిస్ రికార్డు చేయాల్సి వచ్చిందని ఉష పేర్కొన్నారు. పాట వీడియో షూటింగ్ నాణ్యతే విజయానికి ప్రధాన కారణమని అన్నారు. సంతోష్, ప్రశాంత్ అనే యువకులు ఈ పాటకు సాహిత్యం, సంగీతం అందించడమే కాకుండా, నిర్మాతలుగా వ్యవహరించి, అత్యుత్తమ చిత్రీకరణతో పాటను అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారని వాఅన్నారు. మూడు రోజుల పాటు రాత్రి వేళల్లో జరిగిన ఈ షూటింగ్‌కు భారీగా ఖర్చు చేశారని, దాని ఫలితమే పాట ప్రజాదరణ అని వారు వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

ఉష తన అమ్మమ్మ పాటలు పాడేదని, ఆమె పోలికే తనకు వచ్చిందని తెలిపింది. చిన్నతనంలో స్కూల్‌కు ఎగ్గొట్టి మరీ పాటలు పాడేదాన్నని, పీర్ల పండగలు, హోలీ, బొడ్డెమ్మ పండుగలలో గానం చేసేదానినని గుర్తుచేసుకుంది. నరసింహులు కూడా చిన్నప్పటి నుంచే పాటలపై ఆసక్తి పెంచుకున్నానని, స్కూలులో పాడేవాడినని, పదేళ్ల క్రితం చిన్న చిన్న ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొని మెరుగుపడ్డానని తెలిపారు. ఈటీవీలో ప్రసారమైన “ఫోక్ స్టూడియో” వంటి కార్యక్రమాల ద్వారా తమ ప్రయాణం ప్రారంభమైందని వారు చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Actress Pratyusha : హీరోయిన్ ప్రత్యూష మృతి కేసు.. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం..

కొందరు నిర్మాతలు జానపద పాటలపై పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారని, మరికొందరు లాభాలు పొందుతున్నారని వారు తెలిపారు. పాటల చిత్రీకరణ సరిగ్గా లేకపోతే, ఎంత మంచి పాట అయినా ప్రజల్లోకి వెళ్లదని, అందువల్ల వీడియో నాణ్యత చాలా కీలకమని తెలిపారు. తాము పాడిన తర్వాత వీడియో ఎలా ఉంటే బాగుంటుందో నిర్మాతలకు సూచనలు కూడా ఇస్తామని వారు తెలిపారు. అలాగే కొందరు వ్యక్తులు తమ వద్ద దాదాపు 30 పాటలు తీసుకుని తమను మోసం చేశారని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actress Pratyusha : హీరోయిన్ ప్రత్యూష మృతి కేసు.. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం..

ఎక్కువ మంది చదివినవి :  Actress Prathyusha : స్టార్ హీరోలతో సినిమాలు.. కెరీర్ పీక్స్‏లో సూసైడ్.. హీరోయిన్ ప్రత్యూష ఎలా చనిపోయిం

Follow Us
Prabhas: దెబ్బ మీద దెబ్బకు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రభాస్‌
Prabhas: దెబ్బ మీద దెబ్బకు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రభాస్‌
కోటిన్నరకు భర్తను అమ్మేసిన భార్య.. కారణం ఇదే !! మహానుభావురాలు
కోటిన్నరకు భర్తను అమ్మేసిన భార్య.. కారణం ఇదే !! మహానుభావురాలు
'నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు' స్టార్ హీరోయిన్ ఆవేదన
'నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు' స్టార్ హీరోయిన్ ఆవేదన
మిత్రుడైనా.. రెమ్యునరేషన్లో నో కాంప్రమైజ్‌ గురూ..!
మిత్రుడైనా.. రెమ్యునరేషన్లో నో కాంప్రమైజ్‌ గురూ..!
'ధురంధర్'లో విలర్‌ ఛాన్స్ మిస్‌ !! నాగార్జున రియాక్షన్
'ధురంధర్'లో విలర్‌ ఛాన్స్ మిస్‌ !! నాగార్జున రియాక్షన్
ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు..! కానీ కండీషన్స్ అప్లయ్
ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు..! కానీ కండీషన్స్ అప్లయ్
అసలు ప్రత్యూష కేసులో ఏం జరిగింది..? సిద్ధార్థ రెడ్డి ఎవరు..?
అసలు ప్రత్యూష కేసులో ఏం జరిగింది..? సిద్ధార్థ రెడ్డి ఎవరు..?
ఉనికిలో లేని కేసులా? AI మాయాజాలంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన
ఉనికిలో లేని కేసులా? AI మాయాజాలంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. హైవే పై ఎగసిపడిన అగ్నికీలలు
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. హైవే పై ఎగసిపడిన అగ్నికీలలు
అధికారుల పనితీరుపై రేవంత్ రెడ్డి సీరియస్! క్లాస్ పీకిన సీఏం
అధికారుల పనితీరుపై రేవంత్ రెడ్డి సీరియస్! క్లాస్ పీకిన సీఏం