AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Budgets: మార్కెట్‌కి మించిన బడ్జెట్‌లు.. టాలీవుడ్ నిర్మాతల డేరింగ్ స్టెప్.. ఈ రిస్క్ వర్కవుట్ అవుతుందా..?

ప్రస్తుతం భారీ బడ్జె్ట్ పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది. కథతో సంబంధమే లేకుండా కోట్లు ఖర్చు చేసి మరీ మూవీస్ నిర్మిస్తున్నారు మేకర్స్. స్టార్ హీరోస్ కోసం రిస్క్ చేస్తున్నారు. మీడియం రేంజ్ హీరోలకు కూడా వంద కోట్ల సినిమాలు తలుపు తడుతున్నాయి. పాన్ ఇండియా అనే పదం వచ్చాకా.. కథను, మేకింగ్ ను నమ్మి నిర్మాతు ఇప్పుడు పెట్టుబడి విషయంలో సాహసం చేస్తున్నారు.

High Budgets: మార్కెట్‌కి మించిన బడ్జెట్‌లు.. టాలీవుడ్ నిర్మాతల డేరింగ్ స్టెప్.. ఈ రిస్క్ వర్కవుట్ అవుతుందా..?
High Budget Movies
Praveen Vadla
| Edited By: |

Updated on: Feb 10, 2026 | 7:09 PM

Share

బాహుబలి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలు, బడ్జెట్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం టైర్-1 స్టార్ హీరోలకు మాత్రమే పరిమితమైన వంద కోట్ల బడ్జెట్‌లు.. ఇప్పుడు మీడియం రేంజ్ హీరోల తలుపు తడుతున్నాయి. పాన్ ఇండియా అనే పదం వచ్చాక కథను, మేకింగ్‌ను నమ్మి నిర్మాతలు చేస్తున్న సాహసం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే హీరోల గత సినిమాల కలెక్షన్స్, వాళ్ళ ప్రస్తుత మార్కెట్ స్టామినాను పక్కనపెట్టి.. కేవలం కంటెంట్‌ని నమ్మి ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం అనేది కత్తి మీద సాములాంటిదే. ముఖ్యంగా చాలా మంది మీడియం రేంజ్ హీరోల సినిమాల బడ్జెట్స్ చూస్తుంటే కళ్లు బైర్లు గమ్మేస్తున్నాయి. అసలే ధైర్యంతో వీళ్లింత రిస్క్ తీసుకుంటున్నారో అంటూ ముక్కున వేలేసుకోవాల్సిందే. మరీ ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాల బడ్జెట్‌లు చూస్తే కళ్లు చెదిరేలా ఉన్నాయి.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

నాని కెరీర్‌లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన హిట్ 3 సుమారు 69 కోట్ల షేర్ సాధించగా.. ఆయన నెక్స్ట్ చేస్తున్న ది ప్యారడైజ్ సినిమాకు ఏకంగా 150 కోట్లు, సుజిత్ సినిమాకు 130 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే వీటికి నాన్ థియెట్రికల్ బిజినెస్ కూడా అలాగే జరుగుతుంది. అలాగే విజయ్ దేవరకొండ ట్రాక్ రికార్డ్ చూస్తే గీతగోవిందం 70 కోట్ల షేర్‌తో టాప్‌లో ఉంది. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న రణబాలి సినిమాకు 120 కోట్లు, రౌడీ జనార్ధనకు 75 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. వీళ్ళ మార్కెట్ పరిధికి దాదాపు రెట్టింపు బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కుతుండటం గమనార్హం. ఇక సాయి ధరమ్ తేజ్, నాగచైతన్య, నిఖిల్ వంటి హీరోల విషయంలో నిర్మాతలు చేస్తున్న ప్రయోగం మరింత ఆశ్చర్యకరంగా ఉంది. సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో 50 కోట్ల షేర్ మార్క్ టచ్ చేయగా.. ఇప్పుడు సంబరాల ఏటిగట్టు కోసం ఏకంగా 125 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాను కొత్త దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్నాడు.

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..

నాగచైతన్య తండేల్ 52 కోట్ల షేర్ రాబడితే.. సెట్స్‌పై ఉన్న వృషకర్మ కోసం 110 కోట్లు పెడుతున్నారు. కార్తికేయ-2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్ మార్కెట్ 47 కోట్లు కాగా.. స్వయంభు కోసం 80 కోట్లు, ది ఇండియా హౌస్ సినిమాల కోసం 90 కోట్లు పెడుతున్నారు. ఇందులో ది ఇండియా హౌజ్ సినిమాను నిర్మిస్తున్నది హీరో రామ్ చరణ్. తన స్నేహితుడితో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు చరణ్. వీళ్లంతా తమ మార్కెట్ కంటే రెండింతలు ఎక్కువ బడ్జెట్‌ను మోయాల్సి వస్తోంది. మరోవైపు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అఖిల్ అక్కినేని కెరీర్ హైయెస్ట్ షేర్ మొదటి సినిమాతో వచ్చింది.. అది కూడా 18 కోట్లు మాత్రమే. ఆయన ప్రస్తుతం నటిస్తున్న లెనిన్ సినిమాకు 35 కోట్లు కేటాయిస్తున్నారు. అలాగే గోపీచంద్ కెరీర్‌లో లౌక్యం 23 కోట్లతో హైయెస్ట్‌గా ఉంటే.. సంకల్ప్ రెడ్డితో చేస్తున్న సినిమాకు 35 కోట్లు పెడుతున్నారు. వీళ్ళ మార్కెట్‌తో పోల్చితే బడ్జెట్ తక్కువే అనిపించినా.. వాళ్ళ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇది నిర్మాతలకు పెద్ద రిస్క్ అనే చెప్పాలి.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

చివరగా చెప్పాలంటే.. ఈ భారీ బడ్జెట్‌లు వర్కవుట్ అవుతాయా అంటే.. అది పూర్తిగా కంటెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా సగం బడ్జెట్ వెనక్కి వస్తుందన్న ధైర్యం నిర్మాతల్లో కనిపిస్తున్నప్పటికీ.. సినిమా థియేటర్లో మిస్ఫైర్ అయితే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. కంటెంట్ కనెక్ట్ అయితే హనుమాన్, కార్తికేయ 2 రేంజ్ లాభాలు వస్తాయి.. కానీ తేడా కొడితే మాత్రం రికవరీ లేక నిర్మాతలు, బయ్యర్లు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ హై రిస్క్ – హై రివార్డ్ ఆటలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

మార్కెట్‌కి మించిన బడ్జెట్‌లు.. రిస్క్ చేస్తున్న మేకర్స్..
మార్కెట్‌కి మించిన బడ్జెట్‌లు.. రిస్క్ చేస్తున్న మేకర్స్..
సీబీఐ అంటూ కాల్ చేశారు.. కట్ చేస్తే వృద్ధుడి అకౌంట్ నుంచి కోటి..
సీబీఐ అంటూ కాల్ చేశారు.. కట్ చేస్తే వృద్ధుడి అకౌంట్ నుంచి కోటి..
స్పామ్ కాల్స్ సులువుగా గుర్తించొచ్చు.. ఎలా అంటే..?
స్పామ్ కాల్స్ సులువుగా గుర్తించొచ్చు.. ఎలా అంటే..?
షుగర్ ఉన్నవాళ్లు రాత్రి జొన్న రొట్టె తినవచ్చా..?
షుగర్ ఉన్నవాళ్లు రాత్రి జొన్న రొట్టె తినవచ్చా..?
సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు షాకిచ్చిన బీసీసీఐ..
సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు షాకిచ్చిన బీసీసీఐ..
పుట్టగొడుగులు చికెన్ కర్రీ.. కూరల్లో అదిరిపోయే కాంబో.. !
పుట్టగొడుగులు చికెన్ కర్రీ.. కూరల్లో అదిరిపోయే కాంబో.. !
ఈ పాటలో ఏదో మ్యాజిక్ ఉంది..ఒక్కసారి వింటే చాలు మనసు తేలికైపోతుంది
ఈ పాటలో ఏదో మ్యాజిక్ ఉంది..ఒక్కసారి వింటే చాలు మనసు తేలికైపోతుంది
బ్యాచిలర్స్‌కు వరం.. మయోన్నైస్ మ్యాజిక్ తో నోరూరించే ఎగ్ డిష్..
బ్యాచిలర్స్‌కు వరం.. మయోన్నైస్ మ్యాజిక్ తో నోరూరించే ఎగ్ డిష్..
నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి
నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి
ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో
ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో