Prabhas: ప్రభాస్ – ప్రశాంత్ వర్మ సినిమాపై కీలక అప్‌డేట్.. నిర్మాతలు కూడా ఫిక్స్..!
రెబల్ స్టార్ ప్రభాస్, ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రాబోతుందనే ప్రచారం చాలా రోజులుగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే ఫ్యాన్స్‌లో ఓ రేంజ్ బజ్ క్రియేట్ అయింది. అయితే ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై అనుమానాలు మొదలయ్యాయి. అనౌన్స్‌మెంట్‌కు ముందే సినిమా అటకెక్కిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

రెబల్ స్టార్ ప్రభాస్, హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రాబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. నిజానికి ఈ వార్త బయటికి వచ్చిన వెంటనే ఫ్యాన్స్‌లో కూడా ఓ రేంజ్ బజ్ క్రియేట్ అయింది. కానీ ఆ వార్త వచ్చి చాలా కాలం అవుతున్నా ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అనౌన్స్‌మెంట్‌కు ముందే ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందంటూ సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు మొదలయ్యాయి. అసలు ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా ఉందా లేదా..? ఒకవేళ ఉంటే ఎప్పుడు పట్టాలెక్కుతుంది..? ప్రశాంత్ వర్మ డ్రీమ్ ప్రాజెక్ట్ జై హనుమాన్ ముచ్చటేంటి..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఫ్యాన్స్ మదిలో మెదులుతున్నాయి. అసలు ఈ పుకార్లకు ప్రధాన కారణం ప్రభాస్ లైనప్ మామూలుగా లేకపోవడమే. ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులు చూస్తే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం.
ఒకవైపు సందీప్ రెడ్డి వంగాతో రఫ్ అండ్ రస్టిక్ స్పిరిట్, మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, ఇంకోవైపు నాగ్ అశ్విన్ విజువల్ వండర్ ‘కల్కి 2’.. ఇలా మూడు భారీ పాన్ ఇండియా సినిమాలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఇందులో ఫౌజీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా, ఈ మధ్యే ‘కల్కి 2’, ‘స్పిరిట్’ పనులు కూడా ఊపందుకున్నాయి. ఈ మూడు సినిమాలను ఒకేసారి బ్యాలెన్స్ చేస్తూ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డార్లింగ్ మాస్టర్ ప్లాన్ వేశారు. అయితే ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ మూడు సినిమాల తర్వాత ప్రభాస్ ఇమ్మీడియట్‌గా చేయబోయే ప్రాజెక్ట్ ప్రశాంత్ వర్మతోనే అని ఆయన సన్నిహిత వర్గాలు, టీం ఖరాఖండిగా చెబుతున్నాయి. సినిమా ఆగిపోయిందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పేశారు. పైగా ‘సలార్’, ‘కాంతార’ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ ఈ ప్రాజెక్టును అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది.
ఇది ఒక అద్భుతమైన మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందని తెలుస్తుంది. గతంలో ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచే వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఇక ప్రశాంత్ వర్మ ప్రస్తుత విషయానికొస్తే.. ఆయన ఫోకస్ అంతా ఇప్పుడు ‘జై హనుమాన్’ పైనే ఉంది. హనుమాన్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ దర్శకుడు.. దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 22న చారిత్రక ప్రదేశం హంపీలో ఘనంగా ప్రారంభించనున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా షురూ చేయనున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. నేషనల్ అవార్డ్ విన్నర్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ఇందులో హనుమంతుడి పాత్రలో నటిస్తుండటం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
ఈ పరిస్థితులన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది.. ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబోలో రాబోయే సినిమా ఏమాత్రం ఆగలేదు సరికదా.. పక్కా ప్రణాళికతో తెరవెనుక పనులు చకచకా జరుగుతున్నాయి. ఇటు ప్రభాస్ తన కమిట్‌మెంట్స్.. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 పూర్తి చేసుకుని, అటు ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ను పట్టాలెక్కించి ఒక కొలిక్కి తెచ్చేసరికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి ఈ మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ మోస్ట్‌లీ 2027లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అప్పటిదాకా ఫేక్ రూమర్స్‌ను పక్కనపెట్టి, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం వెయిట్ చేయాల్సిందే..!
మరిన్ని సినిమా వార్తలు చదవండి..
