AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఒకప్పుడు హీరో.. ఇప్పుడు పెద్ద డైరెక్టర్.. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ప్రస్తుతం అతడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్. స్టార్ హీరోలతో సినిమాలు.. ప్రతి మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్. వరుస విజయాలతో దూసుకుపోతున్న అతడు.. ఒకప్పుడు హీరో అని చాలా మంది తెలియదు. తాజాగా తన కొత్త సినిమా ఈవెంట్లో మరోసారి తాను నటించిన సినిమాల గురించి వెల్లడించారు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Tollywood : ఒకప్పుడు హీరో.. ఇప్పుడు పెద్ద డైరెక్టర్.. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Venky Atluri
Rajitha Chanti
|

Updated on: Aug 13, 2026 | 8:43 AM

Share

పైన ఫోటోలో హీరో సందీప్ కిషన్ పక్కన కనిపిస్తున్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు తెలుగులో హీరోగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత నటనకు స్వస్తి పలికి డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. స్టా్ర్ హీరోలతో అతడు తెరకెక్కించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడం విశేషం. అతడు మరెవరో కాదు తెలుగు చిత్రసీమలో తనదైన కథలతో విలక్షణమైన ముద్ర వేసుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. మొదటి సినిమాతోనే ఉత్తమ నూతన దర్శకుడిగా ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు.. దుల్కర్ సల్మాన్ హీరోగా ఆయన తెరకెక్కించిన లక్కీ భాస్కర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి గానూ ఉత్తమ రచయితగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో కోలీవుడ్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ..యాక్టింగ్ గురించి అడగ్గా.. నిర్మాత నాగవంశీ స్పందిస్తూ వెంకీ ఒకప్పుడు హీరో అని గుర్తు చేశారు. ఆయన హీరోగా నటించిన చిత్రం స్నేహగీతం.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నాం.. అప్పుడే విడిపోవాలని అనుకున్నాం.. టాలీవుడ్ నటి..

హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన వెంకీ అట్లూరికి చిన్నప్పటి నుంచి రచనపై చాలా ఆసక్తి. అదే క్యూరియాసిటీతో సినీరంగంలోకి అడుగుపెట్టి జ్ఞాపకం అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ సినిమాకు అతడే మైనస్ అనే విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత స్నేహగీతం అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ సైతం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో నటనకు స్వస్తీ చెప్పి దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నారు. ఇట్స్ మై లవ్ స్టోరీ, కేరింత చిత్రాలకు డైలాగ్స్ అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఆయన దర్శకుడిగా పరిచయమైన సినిమా తొలిప్రేమ. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఇంటికి పిలిపించుకుని అభినందించారు. ఆ తర్వాత కోలీవుడ్ హీరో ధనుష్ తో కలిసి సార్ సినిమాను రూపొందించారు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..

తనను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత నాగవంశీతో తనకు ఉన్న బంధం ప్రత్యేకమైనదని చాలా సందర్భాల్లో వెల్లడించారు వెంకీ అట్లూరి. ఇక తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా బ్యాంకింగ్ రంగం నేపథ్యంలో వెంకీ అట్లూరి తెరకెక్కించిన లక్కీ భాస్కర్ సినిమా సైతం భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు సైతం అందుకున్నారు వెంకీ. ఇప్పుడు తన ఫేవరెట్ హీరో సూర్యతో కలిసి విశ్వనాథ్ అండ్ సన్స్ అనే సినిమానూ రూపొందించారు. ఇందులో మమితా బైజు కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న రిలీజ్ చేయనున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..

వెంకీ అట్లూరీ ఫోటో..

Venky Atluri New

Venky Atluri New

ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..

Follow Us