AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ritika Nayak: అతడంటే పిచ్చి ఇష్టం.. కనిపిస్తే చూస్తూనే ఉండిపోతా.. హీరోయిన్ రితికా నాయక్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ రితికా నాయక్ జోరు నడుస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అడియన్స్ హృదయాలు దోచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఆమె నటించిన లేటేస్ట్ మూవీ కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 7న థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రితికా నాయక్ తన ఫేవరేట్ హీరో ఎవరనే విషయాన్ని వెల్లడించింది.

Ritika Nayak: అతడంటే పిచ్చి ఇష్టం.. కనిపిస్తే చూస్తూనే ఉండిపోతా.. హీరోయిన్ రితికా నాయక్..
Ritika Nayak
Rajitha Chanti
|

Updated on: Aug 13, 2026 | 7:57 AM

Share

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రితికా నాయక్. 2022లో అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ముఖ్యంగా ఆమెకు బ్రేక్ ఇచ్చిన సినిమా మిరాయ్. ఈ సినిమా తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు చిత్రంలో నటించింది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 7న థియేటర్లలో విడుదల కాగా.. మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్, కెరీర్ గురించి వెల్లడించింది. అలాగే తనకు ఇష్టమైన హీరో ఎవరనే విషయాన్ని సైతం ప్రస్తావించింది.

ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్ని రితికాను సదరు యాంకర్ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. మీ మొబైల్ వాల్ పేపర్ ఎవరి ఫోటో ఉందని అడగ్గా.. రితికా స్పందిస్తూ..తన ఫోన్ చూపించింది. అందులో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ బీటీఎస్ గ్రూప్ ఫోటో ఉంది. బీటీఎస్ లో మీ ఫేవరెట్ ఎవరు అని అడగ్గా.. వెంటనే సుగా అంటూ చేప్పేసింది. తన ఫేవరెట్ బీటీఎస్ సభ్యుడు సుగా అని అన్నారు. అతడిని కలిసి అవకాశం వస్తే.. తాను ఏం మాట్లాడలేనని.. జస్ట్ అతడిని చూస్తూ ఉండిపోతా అని అన్నారు. సుగాకు తాను పెద్ద అభిమానిని అని.. హాయ్ ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని మాత్రమే చెబుతానని అన్నారు. బీటీఎస్ వరల్డ్ టూర్ గురించి సైతం రితికా ప్రస్తావించారు. బీటీఎస్ భారత్ రాలేకపోవడం తనను చాలా బాధపెట్టిందని.. కానీ ఏదోక రోజు తప్పకుండా వస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. మన దేశంలో బీటీఎస్ బ్యాండ్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నాం.. అప్పుడే విడిపోవాలని అనుకున్నాం.. టాలీవుడ్ నటి..

బీటీఎస్ విషయానికి వస్తే.. ఇది ఒక మ్యూజిక్ బ్యాండ్ గ్రూప్. పూర్తి పేరు (Bangtan Sonyeondan). ఇందులో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. ఆర్‌ఎం (RM), జిన్‌ (Jin),సుగా (SUGA), జె-హోప్‌ (j-hope),జిమిన్‌(Jimin),వీ(V),జంగ్‌కూక్‌ (Jung Kook)సభ్యులుగా ఉన్నారు. వీరికి ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..

రితిక నాయక్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..

Follow Us