EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? వారికి ప్రతీ నెలా అధిక మొత్తంలో పెన్షన్.. కేంద్రం సూపర్ న్యూస్..
కేంద్ర కార్మికశాఖ కీలక ప్రకటన చేసింది. ఈపీఎఫ్ఓ పెన్షన్‌పై లోక్ సభ వేదికగా కీలక వివరాలు వెల్లడించింది. అధిక పెన్షన్ ఎంచుకున్నవారికి పేమెంట్ ఆర్డర్లను విడుదల చేసినట్లు స్పష్టం చేసింది. అయితే స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో సులువుగా చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే..

ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. చాలామంది వాస్తవ జీతం ఆధారంగా అధిక కాంట్రిబ్యూషన్ చెల్లించి అదనపు పెన్షన్ కోరుతూ ఉంటారు. ఇలాంటివారికి అధిక పెన్షన్ పేమెంట్ ఆర్డర్లను కేంద్రం జారీ చేసింది. ఈ విషయాన్ని ఇటీవల పార్లమెంట్ వేదికగా కార్మికశాఖ ప్రకటించింది. అధిక పెన్షన్ కోసం ఏకంగా 15.24 లక్షల మంది క్లెయిమ్స్ పెట్టుకోగా.. వారిలో 1.49 లక్షల మంది పేమెంట్ ఆర్డర్లను జారీ చేసింది. ఇక మిగతా వారి క్లెయిమ్స్‌ను కూడా వేగవతంగా ప్రాసెస్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. నవంబర్ 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వాస్తవ వేతనం ఆధారంగా ఎక్కువ కాంట్రిబ్యూషన్ చెల్లించి పెన్షన్ అమౌంట్ పెంచుకున్నవారి వివరాలను కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. క్లెయిమ్ స్టేటస్‌ను ఎలా చెక్ చేసుకోవాలంటే..?
పెన్షన్ క్లెయిమ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి..?
-ఈపీఎఫ్‌వో అధికారిక పోర్టల్‌కి వెళ్లాలి
-మీ యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్‌తో లాగిన్ అవ్వాలి
-మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి
-నో యువర్ క్లెయిమ్ స్టేటస్ ఆప్షన్ ఎంచుకోవాలి
-అక్కడ మీ క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
-ఉమాంగ్ యాప్ ద్వారా తెలుసుకోవాలంటే ముందుగా యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. అనంతరం ఈపీఎఫ్ఓ సర్వీసెస్ ఎంచుకోవాలి. ఎంప్లాయి సెంట్రిక్ సర్వీసెస్ విభాగంలోకి వెళ్లాలి. ట్రాక్ క్లెయిమ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని చూడవచ్చు.
ఎంత మంది లబ్ది పొందుతున్నారంటే..?
ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కింద ఈఏడాది మార్చి నాటికి 85.84 లక్షల మంది లబ్ది పొందుతున్నారు. అధిక పెన్షన్ పొందేవారికి ప్రతీ నెలా వారి అకౌంట్లో నగదు జమ చేస్తున్నారు. సవరించిన బకాయిలను ప్రతీ నెలా అందిస్తున్నారు. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ తీసుకుని ఖాతాదారులు వివరాలను చెక్ చేసుకోవాలి. ఏమైనా తప్పులు ఉంటే ప్రాంతీయ ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సంప్రదించాలి. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ 2026ను ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని ద్వారా పీఎఫ్‌కు కాంట్రిబ్యూట్ చేసే ప్రతీఒక్కరూ పెన్షన్ పొందే సౌకర్యం ఉంది. ఈపీఎఫ్ సర్వీస్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంటే 58 ఏళ్ల నిండాక ప్రతీ నెలా పెన్షన్ పొందవచ్చు. ఇక 10 ఏళ్ల సర్వీస్ కంటే ముందే రిటైర్మెంట్ అయినా లేదా ఉద్యోగం మానేసినా వీటిని ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు. మీ జీతం ఆధారంగా పెన్షన్ అందుతుంది. ప్రస్తుతం కనీస పెన్షన్ పరిమితి రూ.వెయ్యిగా ఉంది. దీనిని రూ.3 వేలుగా పెంచాలనే డిమాండ్ ఉంది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
