మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్..! రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్.. ఎందుకంటే..
తెలంగాణలో కొత్తగా అమలు చేయనున్న ప్రివిలెజ్ సెస్‌పై బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ నిరసనకు దిగింది. సెస్ కారణంగా ఒక్కో బార్‌పై ఏటా సుమారు రూ.30 లక్షల వరకు అదనపు భారం పడుతుందని యజమానులు చెబుతున్నారు. ఇప్పటికే భారీ లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నామని పేర్కొంటూ, ప్రివిలెజ్ సెస్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్ నెరవేరకపోతే ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు.

తెలంగాణలోని బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్స్ బంద్ చేయబోతున్నట్టుగా అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న ప్రివిలెజ్ సెస్‌తో తీవ్రంగా నష్టపోతున్నట్టు వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రివిలెజ్ సెస్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ సర్కార్ ప్రివిలెజ్ సెస్ పేరిట ఏటా ఒక్కో బార్ నుంచి 8 శాతం నుంచి 20శాతం వరకు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రతియేటా సుమారు 30 లక్షల రూపాయల వరకు అదనంగా బార్లపై భారం పడుతుందని బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు వాపోతున్నారు. ఇప్పటికే వైన్స్‌లో పర్మినెంట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వడం.. దీనికితోడు బెల్ట్ షాపులతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇన్ని కష్టాలు వెంటాడుతున్నా.. బార్ల వార్షిక లైసెన్స్ ఫీజు పేరుతో ప్రతిఏటా ప్రభుత్వానికి 33 లక్షల నుంచి 56 లక్షల రూపాయలు చెల్లిస్తున్నామని, ఇదీ చాలదన్నట్టు ప్రివిలెజ్ సెస్ పేరుతో అధనంగా 30లక్షల రూపాయల వరకు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రివిలెజ్ సెస్‌ను వెంటనే రద్దు చేయాలని లేదంటే.. లేదంటే ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తామంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
