AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రియురాలి భర్త, మామకు నిప్పంటించి.. తానూ ఆత్మహత్య!

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివాహితతో తనకున్న ప్రేమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కోపంతో ఆమె ప్రియుడు దారుణానికి పాల్పడ్డాడు. మహిళ భర్త, మామపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను కూడా విషపదార్థం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..

ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రియురాలి భర్త, మామకు నిప్పంటించి.. తానూ ఆత్మహత్య!
Gwalior Crime News
Balaraju Goud
|

Updated on: Nov 24, 2026 | 4:03 PM

Share

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివాహితతో తనకున్న ప్రేమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కోపంతో ఆమె ప్రియుడు దారుణానికి పాల్పడ్డాడు. మహిళ భర్త, మామపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను కూడా విషపదార్థం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..

పోలీసుల వివరాల ప్రకారం.. గ్వాలియర్‌లోని మాధవ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హేమ్ సింగ్ కీ పరేడ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రజత్ పాల్ అనే యువకుడు గత మూడేళ్లుగా బాధిత మహిళతో కలిసి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమ సంబంధానికి దారితీసింది. కొంతకాలానికి వీరి వ్యవహారం మహిళ కుటుంబ సభ్యులకు తెలిసింది.

దీంతో మహిళ భర్త రజత్‌ను పిలిచి మాట్లాడాడు. తన కుటుంబానికి దూరంగా ఉండాలని, ఇంటికి రావద్దని గట్టిగా హెచ్చరించాడు. అప్పటి నుంచి రజత్ ఆ ఇంటికి రావడం మానేశాడు. అయితే, ఈ విషయంపై అతడిలో ఆగ్రహం పెరిగినట్లు తెలుస్తోంది.

పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు

ఆదివారం (నవంబర్ 22) రజత్ పాల్ పెట్రోల్ నింపిన మద్యం సీసాతో అకస్మాత్తుగా మహిళ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న మహిళ భర్త, మామ అతడి రాకను వ్యతిరేకించారు. దీంతో ఆగ్రహానికి గురైన రజత్ వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం. ఈ ఆకస్మిక దాడితో ఇంట్లో తీవ్ర కలకలం చెలరేగింది. అనంతరం రజత్ కూడా విషపదార్థం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న మహిళ భర్త, మామను వెంటనే జ్యోతి ఆసుపత్రికి తరలించారు. అక్కడి బర్న్ యూనిట్‌లో వారికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు విషం తాగిన రజత్ పరిస్థితి విషమించడంతో అతడి కుటుంబ సభ్యులు మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.

ఈ ఘటనపై మహిళ కుమారుడు స్పందిస్తూ.. రజత్ తన తల్లితో కలిసి పనిచేసేవాడని, అందువల్ల తరచూ తమ ఇంటికి వచ్చేవాడని తెలిపాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఉన్న సంబంధం కుటుంబ సభ్యులకు తెలిసిందని చెప్పాడు. తన తండ్రి రజత్‌ను ఇంటికి రావద్దని హెచ్చరించడంతోనే అతడు కక్ష పెంచుకున్నాడని ఆరోపించాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ ఘటనపై మాధవ్‌గంజ్ పోలీసులు రజత్ పాల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లష్కర్ సీఎస్పీ కిరణ్ అహిర్వార్ మాట్లాడుతూ.. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. ప్రస్తుతం బాధిత భర్త, మామతో పాటు నిందితుడు రజత్ కూడా ప్రమాదం నుంచి బయటపడినట్లు సమాచారం. ముగ్గురికీ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స కొనసాగుతోంది.

ప్రేమ వ్యవహారం, కుటుంబ వివాదం చివరకు ప్రాణాల మీదకు తెచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us